Rohit sharma injury: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో భారత్ ఆస్ట్రేలియా జట్లు1 – 1 తో సమానంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు కీలకమైన నాలుగో టెస్ట్ మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ఆదిక్యం సంపాదించాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే ఇరుజట్లు మెల్బోర్న్ చేరుకొని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి.
Also Read: Gukesh – Rashmika: టాలీవుడ్ హీరోయిన్ కి గుకేశ్ కి ఉన్న రిలేషన్?
అయితే ఈ మ్యాచ్ కి ముందు టీమ్ ఇండియాకి భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. త్రో డౌన్ స్పెషలిస్ట్ దయాను ఎదుర్కొనే క్రమంలో బాల్ రోహిత్ శర్మ ఎడమకాళి మోకాలికి బలంగా తాకినట్లు సమాచారం. వెంటనే ప్రాక్టీస్ ఆపేసి కుర్చీలో కూర్చుండిపోయాడు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు వెంటనే వైద్యసాయం కోరాడు.
ఫిజియోలను రప్పించుకుని ప్రథమ చికిత్స తీసుకున్నాడు. రోహిత్ శర్మ గాయానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాలుగో టెస్ట్ ప్రారంభం కావడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ కి గాయం కావడం అభిమానులను కలవరపెడుతోంది. మరో మూడు రోజులలో ఒకవేళ రోహిత్ శర్మ గాయం మానితే అతడు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.
కానీ రోహిత్ అందుబాటులో లేకపోతే మాత్రం.. ద్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ఇక కెప్టెన్ గా జస్ ప్రీత్ బుమ్రా తిరిగి బాధ్యతలు చేపడతాడు. నాలుగో టెస్ట్ కి రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే మాత్రం అది భారత్ కి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఇక ఈ ప్రాక్టీస్ లోనే కేఎల్ రాహుల్ చేతికి గాయమైనట్లు సమాచారం. కానీ వీరిద్దరి గాయాలపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read: Notice to Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్… ఆ పబ్‌కు నోటీసులు.?
ఇక ఈ సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 2 టెస్ట్ మ్యాచ్ లలోని 4 ఇన్నింగ్స్ లలో సింగిల్ డిజిట్ స్కోర్ లకే పరిమితమయ్యాడు. డిసెంబర్ 26న ఉదయం 5 గంటలకు భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా ఈ బాక్సింగ్ డే టెస్ట్ జరగనుంది. వెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో పేస్ తో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉండనుంది. దీంతో టీమ్ ఇండియా జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటు కల్పించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు విశ్లేషకులు.