E-Paper
Advertisement

BRS Assets: ఈసీకి ఆడిట్ రిపోర్టు ఇచ్చిన బీఆర్ఎస్.. భారీగా పెరిగిన ఆస్తులు

BRS Assets: ఈసీకి ఆడిట్ రిపోర్టు ఇచ్చిన బీఆర్ఎస్.. భారీగా పెరిగిన ఆస్తులు
Advertisement

BRS Assets: కేంద్ర ఎన్నికల సంఘానికి BRS పార్టీ 2022-23 సంత్సరానికి సంబంధించిన ఆడిట్‌ రిపోర్టును సమర్పించింది. ఇందులో తమ పార్టీకి పదకొండు వందల నలబై తొమ్మది కోట్లు ఆస్తులున్నట్లు వివరించింది. ఇందులో 967 కోట్లు 12 నెలలకు మించిన మెచ్యూరిటీ పీరియడ్‌తో షెడ్యూల్డ్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌గా ఉండగా.. వివిధ బ్యాంక్ బ్రాంచుల్లో 180 కోట్ల మేర నిల్వలున్నట్లు తెలిపింది.

జిల్లా పార్టీ బ్యాంకు ఖాతాల్లో 39.86 లక్షలు, నగదు రూపంలో 77వేలు రూపాయాలు ఉన్నట్లు తెలిపారు. ఇతర ఆస్తుల రూపంలో 2.02 కోట్లు ఉన్నట్లు ఆడిట్‌ నివేదికలో వెల్లడించింది. 2022 మార్చి 31 నాటికి 480 కోట్లు ఉండగా.. ఏడాది కాలంలో 139.37 శాతం పెరిగాయి.

Advertisement

బీఆర్ఎస్‌కు ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆదాయం 737.67 కోట్లు, ఖర్చులు 57.47 కోట్లు వచ్చాయి. మిగిలిన 680.20 కోట్లను జనరల్‌ ఫండ్‌కు బదిలీ చేసింది. 2022 మార్చి 31 నాటికి 218.11 కోట్లు సమకూరగా.. ఈ సంవత్సరం 238 శాతం పెరిగింది. ఎన్నికలు, ఉద్యోగులు, పరిపాలన, ఇతరత్రా అవసరాల కోసం ఈసారి 56.86 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రయాణాలకు 12.30 కోట్లు, ప్రకటనలు, ప్రచారాలకు 14.80 కోట్లు, ఢిల్లీ ఆఫీసు అద్దె కోసం 1.77 కోట్లు, సిబ్బంది వేతనాలు, సంక్షేమం కోసం రూ.1.20 లక్షలు వెచ్చించారు.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×