E-Paper
Advertisement

రైతుల కష్టాలకు ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్!

రైతుల కష్టాలకు ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్!
Advertisement

RS Praveen Kumar: కాళేశ్వరంప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగిపోవడంపై సిట్ వేసి విచారణ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, ఈ రేస్ మీద కాదని సూచించారు. తెలంగాణ భవన్ లో గురువారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మీ బ్యారేజ్ 21 అక్టోబర్ 2023 లో పేల్చారని రవికాంత్ ఫిర్యాదు చేసి 3 ఏళ్లు దాటిందని, ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు అని, గాఢ నిద్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర బాధలు పడుతున్నారని, పత్తి రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు.

సీఎం పట్టించుకోకుండా ఎల్ నినో ప్రభావంతో నీరు ఇవ్వలేం అంటున్నారన్నారు. యాసంగి అసలు పంటలు వేయకండి అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, తాగడానికి కూడా నీరు లేవని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ బాగుంటే ఈ కరువు వచ్చేది కాదన్నారు. కంట్రోల్డ్ ఎక్స్ ప్లోజన్ తో డిటోనేటర్లు పెట్టి పేల్చి ఉంటారని అనుమానంఉందన్నారు. మేడిగడ్డ లక్ష్మి బారేజ్ లో 8 బ్లాక్ లు ఉండగా… 7 వ బ్లాక్ పిల్లర్ 20 కుంగిపోయిందన్నారు. జియాలజీ డిపార్ట్ మెంట్ ద్వారా సీస్మిక్ డాటా సేకరించాలని భూకంపం ఏమైనా వచ్చిందా, రిక్టర్ స్కేల్ మీద రీడింగ్ ఎంత నమోదైంది అనేది తెలుసుకొని ఉండాలని అన్నారు. డిటొనేటర్లు తో పేలుళ్లు జరిగినపుడు భూకంపం వచ్చినట్టుగా శబ్దం వస్తుందన్నారు. బ్యారేజీని పేల్చేసిన కేసును ఎలా క్లోజ్ చేస్తారని నిలదీశారు.

Advertisement

25 లక్షల క్యూసెక్కుల వరదను ఆపగలిగినది లక్ష్మి బ్యారేజీ అని స్పష్టం చేశారు. కూలిపోయే నాటికి వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులు మాత్రమే ఉందని.. అలాంపుడు ఎలా కుంగిపోతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి అక్టోబర్ 3 2023న తియస్థా నది మీద కట్టిన డ్యాం ధ్వంసమైతే 70 మంది చనిపోయారు కానీ ఆయన, దీనిపై ఎన్.డీ.ఎస్.ఏ కు లేఖ రాయలేదని ప్రశ్నించారు. కానీ కేవలం మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోయిందని ఎన్ డి ఎస్ ఏ కు కిషన్ రెడ్డి లేఖ రాశారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ ఫోన్ కాల్ డేటా, వారి పోల్ స్ట్రాటజిస్టులు, వారితో సంబంధాలు కలిగి ఉన్న మాజీలను గుర్తించి వారి కాల్ డేటా సేకరించి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. గొడవలో డీఆర్డీఓ ఉద్యోగి మృతి.. అసలేం జరిగిందంటే?

Advertisement

కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకపోవడం వల్ల ఆంధ్రకు లాభం అని, క్రాప్ హామీ డే అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయడం దారుణమని, సాగు నీరు లేకపోవడానికి కారణం కాంగ్రెస్సే అని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. కేసీఆర్ మీద కోపంతో మాత్రమే కన్నెపల్లి నీరు ఎత్తిపోయలేదన్నారు. నీరు ఆంధ్రకు పంపడానికే కాఫర్ డ్యాం కట్టలేదన్నారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రాబోయే రోజుల్లో 25 వేల కోట్ల పంట నష్టం జరుగబోతుందని, దీనికి ప్రభుత్వమే కారణమన్నారు. కరువును ఎదుర్కొనే శక్తి తెలంగాణకు ఉన్నా, ప్రభుత్వం అది చేయలేదన్నారు.

Also Read: ఆడి కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి, బాధితుడ్ని తొక్కుకుంటూ వెళ్లిన డ్రైవర్!

Tags

Related News

హైదరాబాద్‌లో 87 నిమిషాల మనీ గేమ్.. దెబ్బకు రూ. 3.34 కోట్లు స్వాహా!

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.. ఏకంగా రూ.39 లక్షలకు పైగా లంచం వసూల్!

ఈ-ముద్ర ప్రైవేట్ కీస్ లోపం అసలు ఎలా జరిగింది?.. అసలు మ్యాటర్ ఇదే?

తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. గొడవలో డీఆర్డీఓ ఉద్యోగి మృతి.. అసలేం జరిగిందంటే?

వచ్చే 8 నెలలు బిగ్ అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కీలక సూచనలివే?

నేరాలపై ఉమ్మడి దండయాత్ర.. దక్షిణాది రాష్ట్రాల పోలీసు బాస్‌ల మెగా మీట్!

Big Stories

Advertisement
×