BRS Party: తెలంగాణలో బీఆర్ఎస్ శవరాజకీయాలు చేస్తోందా? అధికారం కోల్పోయామనే అక్కసుతో కేటీఆర్ కుట్ర చేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా సంవత్సరం అవుతోంది. అంతకుముందు రాష్ట్రంలో పదేళ్లపాటూ బీఆర్ఎస్ పాలన సాగించింది. అయితే పదేళ్లపాటూ రాష్ట్రంలో ఏం జరిగినా పట్టించుకోని, ప్రతి పక్షాల నోరు మూయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకింత రచ్చ చేస్తోందని అధికారపార్టీతో పాటూ ప్రతిపక్షంలో ఉన్న ఇతర పార్టీలు నిలదీస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ తో పాటూ బీజేపీ, కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజలమీద ఎన్నడూలేని విధంగా ప్రేమ చూపిస్తోంది విమర్శిస్తున్నారు.
ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మకపోవడంతో ఇప్పడు రాష్ట్రంలో బీఆర్ఎస్ శవరాజకీయాలు మొదలు పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలలో పనిచేస్తున్న ఓ అధికారి కావాలనే పురుగుల బియ్యాన్ని ఇచ్చి ఆ బియ్యాన్నే వండాలని వంటమనుషులను ఆదేశించాడనే వార్తలు వస్తున్నాయి. ఆ బియ్యం వండటం వల్ల పుడ్ పాయిజన్ అయితే ప్రభుత్వంపై బురద చల్లవచ్చని, ఓ పథకం రచించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఓ విద్యార్థి పరిస్థితి విషమించి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకున్నాయి.
Also read: ప్లాన్ రివర్స్ అడ్డంగా బుక్కైన హరీష్, కేటీఆర్
అప్పుడు బీఆర్ఎస్సే అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. మెస్ చార్జీలను కూడా పెంచకపోవడంతో విద్యార్థుల తల్లి దండ్రులు సైతం ఆ పార్టీని నమ్మడంలేదు. గురుకులాలకు కనీసం బిల్డింగులు కూడా కట్టించకపోవడం వల్లనే హాస్టళ్లలోకి ఇప్పుడు పాములు వస్తున్నాయని తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లగచర్ల ఘటనలోనూ కుట్ర దాగుందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నాయకులే రైతులను రెచ్చగొట్టి కలెక్టర్ పై దాడి చేశారని వార్తలు వచ్చాయి. మరోవైపు కలెక్టర్ ను ఏకంగా చంపేయాలనే ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు వినిపించాయి. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నాగేందర్ రెడ్డి అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు.
ఈ ఘటన వెనుక కేటీఆర్ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీటితో పాటూ సీఎం సొంతూరులో ఏం జరిగినా దాన్ని సీఎంకు, ఆయన కుటుంబ సభ్యులకే ఆపాదించడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇటీవల సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోగా దానిని ముఖ్యమంత్రి కుటంబానికే ఆపాదిస్తూ ఆరోపణలు చేశారు. కొంతమంది పెయిడ్ జర్నలిస్టులతో కేటీఆర్ ఈ ప్రచారం చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఇదే వైఖరి ప్రదర్శిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా వచ్చిన పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటర్లు అలాంటి సమాధానమే చెబుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.