Multani Mitti For Skin: ముల్తానీ మిట్టి ఒక సహజ ఔషధం. ఇది చర్మ సంరక్షణకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యకిరణాలు, కాలుష్యం, దుమ్ము, ధూళితో పాటు అనేక కారణాల వల్ల ముఖం, మెడపై టాన్ పెరిగిపోతుంది. అయితే, ఈ సమస్యను సాధారణ సహజ నివారణలతో పరిష్కరించుకోవచ్చు. వాటిలో ఒకటి ముల్తానీ మిట్టి. ముల్తానీ మిట్టి చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చర్మ సంరక్షణకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ముల్తానీ మిట్టితో ముఖాన్ని ఎలా మెరిసేలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
ముల్తానీ మిట్టి – 2 స్పూన్లు
రోజ్ వాటర్- 1 టీ స్పూన్
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో 2 చెంచాల ముల్తానీ మిట్టి తీసుకోండి. దీనికి 1 టీస్పూన్ రోజ్ వాటర్ వేసి కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మెడపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత నీళ్లతో వాష్ చేయండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ స్కిన్‌పై ఉన్న ట్యాన్ తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజ్ వాటర్ సహజమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మానికి తాజాదనాన్ని అందించడంతో పాటు మెరుపును కూడా అందిస్తుంది.
2. ముల్తానీ మిట్టి , నిమ్మరసంతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
ముల్తానీ మిట్టి – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: 2 టీస్పూన్ల ముల్తానీ మిట్టిని తీసుకుని దానికి 1 టీస్పూన్ నిమ్మరసం కలపండి.తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ముఖం, మెడపై అప్లై చేయాలి. అనంతరం 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసం సహజమైన బ్లీచింగ్ ఏజెంట్. ఇది చర్మంపై మచ్చలు తొలగించడంతో సహాయపడుతుంది. అంతే కాకుండా ముల్తానీ మిట్టిలో నిమ్మరసం కలిపి వాడితే ముఖం తెల్లగా మారిపోతుంది.
3. ముల్తానీ మిట్టి, హనీ ఫేస్ ప్యాక్:
కావలసినవి:
ముల్తానీ మిట్టి- 2 టేబుల్ స్పూన్లు
తేనె-1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: 2 చెంచాల ముల్తానీ మిట్టిని తీసుకుని అందులో 1 చెంచా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
దీని తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
Also Read: పసుపులో ఈ ఒక్కటి కలిపి వాడితే.. మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది తెలుసా ?
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముల్తానీ మిట్టితో తేనెను ఉపయోగించడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. అంతే కాకుండా మెడపై ఉన్న జిడ్డు కూడా మాయం అవుతుంది. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.