BigTV English

BRS failure in Singareni : మరోసారి బీఆర్ఎస్ కు భంగపాటు.. సింగరేణిలో డిపాజిట్ గల్లంతు..

BRS failure in Singareni : కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం మరోసారి బట్టబయలు అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న బీఆర్ఎస్…. తాజాగా వెల్లడైన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీజీబీకేఎస్…. ఎలక్షన్ లో ఏ మాత్రం ప్రభావం చూపకుండా…. రేస్ నుంచి అవుట్ అయ్యింది. 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో…. ఒక్క చోట కూడా దక్కకపోగా…. డిపాజిట్లు కూడా దక్కకపోవడం బీఆర్ఎస్ వైఫ్యల్యాన్ని బయటపెడుతుంది.

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో మొత్తం 11 ఏరియాల్లోని 84 పోలింగ్ కేంద్రాల్లో 94.15శాతం పోలింగ్ జరిగింది. బుధవారం అర్థరాత్రి తరువాత వెల్లడయిన ఫలితాల్లో 11 ఏరియాల్లో…. ఆరు చోట్ల ఐఎన్టీయూసీ, ఐదు చోట్ల ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి. అయితే ఆయా ఏరియాల్లో అత్యధికంగా ఓట్లు సాధించిన యూనియన్ ను ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తారు. అందులో భాగంగానే ఏఐటీయూసీ సంఘం సింగరేణి గుర్తింపు సంఘంగా విజయకేతనం ఎగురవేసింది.

ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. నువ్వానేనా అన్నట్లు ఇరు సంఘాలు పోటీపడ్డాయి. గత రెండు దఫాలుగా సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీకేఎస్ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది. 1998 నుంచి 2023 వరకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఏడుసార్లు జరిగాయి. తాజా విజయంతో ఏఐటీయూసీ నాలుగు సార్లు విజయం సాధించగా…. టీజీబీకేఎస్ రెండు సార్లు.. ఐఎన్టీయూసీ ఒక్కసారి విజయం సాధించాయి.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×