E-Paper

South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?

South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?
Advertisement

South Telangana: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని ‘దక్షిణ తెలంగాణ’ ప్రాంతంపై గులాబీ బాస్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో అంతర్గత (ఇంటర్నల్) సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠం చేయడమే లక్ష్యంగా సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

లీడర్ల రిపోర్ట్ కార్డ్.. ఉమ్మడి జిల్లాల వారీగా ఫీడ్‌బ్యాక్!

ఇటీవలి ఎన్నికల ఫలితాలు, క్షేత్రస్థాయిలో కేడర్ బలాబలాలు, స్థానిక సమీకరణలపై కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా లోతైన ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో వన్-టు-వన్ సమావేశాలు నిర్వహిస్తూ వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. స్థానిక సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత రాజకీయ సమీకరణలపై క్షుణ్ణంగా నివేదికలు తెప్పించుకుంటు న్నట్లు సమాచారం. యువత రైతులు మహిళ ల్లో పార్టీ పట్ల ఉన్న సానుకూల ప్రతికూల అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం. కేవలం లీడర్లు చెప్పే మాటలకే పరిమితం కాకుండా, పార్టీ అంతర్గత విభాగాలు ఇచ్చిన గ్రౌండ్ రిపోర్టులను కూడా బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం.

ఈ నాలుగు జిల్లాల్లో..

Advertisement

దక్షిణ తెలంగాణ జిల్లాలు అయినా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అయితే ఈ నాలుగు జిల్లాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ చతికిల పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కేవలం భద్రాచలం ఒకటి మాత్రమే విజయం సాధించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం సూర్యాపేట మాత్రమే గెలుచుకోగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కేవలం గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే గులాబీ విజయం సాధించింది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 10 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని దక్షిణ తెలంగాణ పై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక హోదా పెట్టింది.

Also read: Trump Netanyahu: మిత్రుల మధ్య చిచ్చు పెట్టిన ఇరాన్ డీల్.. నెతన్యాహును ‘క్రేజీ’ అని తిట్టిన ట్రంప్..!

పనితీరుపైనే నజర్.. నో ప్లేస్ ఫర్ లీథార్జీ!

Advertisement

పార్టీలో సీనియారిటీ ఉన్నప్పటికీ, యాక్టివ్‌గా లేని నాయకుల పనితీరుపైన అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ప్రజా పోరాటాల్లో చురుగ్గా పాల్గొనక పోవడంపై అధిష్టానం సీరియస్ గా ఉంది.ప్రజల్లో, కేడర్‌లో నిరంతరం ఉండే నాయకులకే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని కేటీఆర్ అంతర్గత సమావేశాల్లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు పార్టీ కార్యక్రమాల్లో నేతల భాగస్వామ్యం ఎలా ఉందో రికార్డులను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పనితీరు మెరుగుపరుచుకోని చోట అవసరమైతే నియోజకవర్గ ఇన్ఛార్జులను మార్చేందుకు కూడా వెనకాడబోమనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం. కష్టపడే ద్వితీయ శ్రేణి నాయకత్వానికి బాధ్యతలు అప్పగించేందుకు కూడా వెనకాడ బొమ్మని అంతర్గత సమావేశాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

పక్కా ప్రణాళికతో..

టార్గెట్ ‘నెక్స్ట్ అసెంబ్లీ హడావుడిగా కాకుండా, ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో క్షేత్రస్థాయి కమిటీలను పునర్వ్యవస్థీకరించి, పాత-కొత్త నేతల సమన్వయంతో దక్షిణ తెలంగాణను మళ్లీ గులాబీ కోటగా మార్చడమే లక్ష్యంగా బీఆరెస్ అడుగులు వేస్తోంది. ఓటర్ జాబితా ప్రక్షాళన, డిజిటల్ సభ్యత నమోదు ఒంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన కేటీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా దక్షిణ తెలంగాణలో పట్టు సాధించడం లక్ష్యంగా గులాబీ దళం వేస్తున్న అడుగులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

Also read: Rythu Bharosa: తెలంగాణ రైతులకు పండగే పండగ.. 67 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు..!

Related News

ఇష్టపడి చదవండి.. దేశానికే ఆదర్శం కాండి.. విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపు!

తెలంగాణలో జనసేన దూకుడు.. మణికొండలో పార్టీ ఆఫీసు.. ప్రారంభించిన పవన్

Jana Sena: తెలంగాణ లీడర్లకు జనసేన గాలం.. అలాంటి నేతలే టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం!

Nalgonda Tour: నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన

తెలంగాణలో భానుడి ప్రతాపం.. ఆ తర్వాత హైదరాబాద్, సాయంత్రం ఆ జిల్లాలకు అలర్ట్

హైదరాబాద్‌లో డేంజరస్ గ్యాంగ్.. గల్లీల్లో అండర్‌గ్రౌండ్ WWE ఫైట్లు, రక్తం ఒలికేలా కొట్టుకుంటూ..!

Big Stories

×