E-Paper
Advertisement

మారుతి ఇ-విటారా ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

మారుతి ఇ-విటారా ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?
Advertisement

Maruti e-Vitara Price Revision: భారత్ లోకి తన ఫస్ట్ ఎలక్ట్రిక్ SUVగా మారుతి సుజుకి తీసుకొచ్చిన ఇ-విటారా ధరలను కంపెనీ తాజాగా పెంచింది. ఫిబ్రవరి 2026లో ఈ మోడల్‌ ను మార్కెట్లో విడుదల చేసిన తర్వాత ఇదే మొదటి ధరల పెంపు కావడం విశేషం. కొన్ని వేరియంట్లపై గరిష్టంగా రూ.30,000 వరకు ధరలు పెరిగాయి.

మూడు వేరియంట్లలో ఇ-విటారా

ఇ-విటారా కొనుగోలుదారులకు మారుతి రెండు విధాలుగా ఈ SUVను అందిస్తోంది. ఒకటి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) పద్ధతి, మరొకటి పూర్తి వాహనం కొనుగోలు విధానం. తాజా ధరల పెంపు ఈ రెండు ఎంపికలకూ వర్తిస్తుంది. అయితే ఎంట్రీ లెవల్ డెల్టా వేరియంట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఇ-విటారా డెల్టా, జీటా, ఆల్ఫా అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. జీటా వేరియంట్‌ పై రూ.30,000 వరకు, ఆల్ఫా వేరియంట్‌ పై రూ.20,000 వరకు ధర పెరిగింది. దీంతో టాప్ వేరియంట్ ధర ఇప్పుడు మరింత పెరిగింది.

ఒకే ఛార్జ్ తో 543 కి.మీ రేంజ్

Advertisement

మారుతి ఇ-విటారాలో రెండు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. 49 kWh, 61 kWh సామర్థ్యం గల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్‌ లను కంపెనీ అందిస్తోంది. చిన్న బ్యాటరీతో వచ్చే మోడల్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 440 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పెద్ద 61 kWh బ్యాటరీతో వచ్చే వేరియంట్ 543 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. పనితీరు పరంగా కూడా ఈ SUV ఆకట్టుకునేలా ఉంది. 49 kWh బ్యాటరీ వెర్షన్ 105.8 kW పవర్‌ ను ఉత్పత్తి చేస్తే, 61 kWh బ్యాటరీ వెర్షన్ 128 kW పవర్‌ను అందిస్తుంది. రెండు మోడళ్లలోనూ 193 Nm టార్క్ లభిస్తుంది.

భద్రతలోనూ మంచి గుర్తింపు

భద్రత విషయంలో ఇ-విటారా మంచి గుర్తింపు సంపాదించింది. ఈ SUVకు 5 స్టార్ భారత్ NCAP రేటింగ్ లభించింది. డ్రైవర్ మోకాలి ఎయిర్‌ బ్యాగ్‌ తో సహా మొత్తం ఏడు ఎయిర్‌ బ్యాగ్‌ లు స్టాండర్డ్‌ గా అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డిస్క్ బ్రేకులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవెల్-2 ADAS లాంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. డిజైన్ పరంగా ఇ-విటారా సింపుల్ అయినప్పటికీ లేటెస్ట్ లుక్ ను కలిగి ఉంది. LED హెడ్‌ ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ స్పాయిలర్ లాంటి అంశాలు మరింతగా ఆకట్టుకుంటాయి.

ఆకట్టుకునేలా ఇంటీరియర్

Advertisement

ఇంటీరియర్‌ లో 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, గ్లాస్ సన్‌ రూఫ్, ప్రీమియం ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు పలు డ్రైవింగ్ మోడ్‌ లను కూడా అందిస్తోంది. ప్రస్తుతం మారుతి ఇ-విటారా, మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ EV, MG ZS EV, టయోటా అర్బన్ క్రూయిజర్ EV లాంటి మోడళ్లతో పోటీ పడుతోంది. త్వరలో టాటా సియెర్రా EV కూడా ఈ జాబితాలో చేరనుంది.

Read Also: విడుదలకు ముందు టాటా సియెర్రా ఈవీ టీజర్ లాంచ్.. లుక్ చూస్తే మతిపోవడం పక్కా!

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×