BigTV English

BRS: కేటీఆర్ జైలుకి వెళ్తే.. బీఆర్ఎస్‌ను నడిపేదెవరు? రాత్రి ఏం జరిగింది?

BRS: కేటీఆర్ జైలుకి వెళ్తే.. బీఆర్ఎస్‌ను నడిపేదెవరు? రాత్రి ఏం జరిగింది?

BRS: త్వరలో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఫార్ములా ఈ కారు రేసు కేసు కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిసుకున్నట్టేనా? ఆయన జైలుకి వెళ్లే.. ఇప్పుడున్న సమయంలో పార్టీని నడిపేదెవరు? హరీష్‌రావు పగ్గాలు అందుకుంటారా? కవిత రంగంలోకి దిగుతుందా? ఇదే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆ పార్టీ నేతలు ఎందుకు పక్క చూపు చూస్తున్నారు?


ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీనిపై బీఆర్ఎస్ ఇంకా ఫైట్ చేస్తోంది. సుప్రీంకోర్టులో ఉపశమనం కలుగు తుందని చిన్న ఆశ. విచారణ సందర్భంగా ఏసీబీ లేదా ఈడీ అరెస్ట్ చేసే అవకాశముంది. ఒకవేళ కేటీఆర్ అరెస్టయితే ఆరునెలల వరకు బెయిల్ రావడం కష్టమనే ప్రచారం లేకపోలేదు.

లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ తర్వాత దాదాపు ఆరునెలలకు బెయిల్ రాలేదు. కేటీఆర్‌కు అదే పరిస్థితి ఎదురవుతుందా? అనే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. ఈ విషయాన్ని కాసేపు పక్కనబెట్టి పార్టీ విషయానికొద్దాం. కొద్దిరోజులు ప్రత్యక్ష రాజకీయా లకు కేసీఆర్ దూరమయ్యారు. కనీసం బయటకు కనిపించలేదు. ఎవరైనా వెళ్తే అందుకు సంబంధించి వీడియోలను మాత్రమే కారు పార్టీ విడుదల చేస్తోంది.


గతరాత్రి కేటీఆర్, కవిత, హరీష్‌రావులు కలిసి పార్టీ చీఫ్ కేసీఆర్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ జైలుకి వెళ్లే పరిస్థితి వస్తే ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఈ విధంగా ముందుకు వెళ్లాలి? అనే దానిపై చర్చించినట్టు పార్టీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకువచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలను పక్కన బెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ALSO READ: చుట్టుముట్టిన‌ ‘లొట్టపీసు’.. ఈడీ, ఏసీబీ విచార‌ణ‌పై గుబులు.. కేటీఆర్ అంతరార్థం ఇదేనా!

ఫార్ములా విషయాన్ని డైవర్ట్ చేసేందుకు చీటికీ మాటికీ మీడియా ముందుకొచ్చి అధికార పార్టీపై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారట. దీనివల్ల ఫార్ములా వ్యవహారం మరుగునపడి, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగు తుందనే అంచనాకు వచ్చారు. ఇంతవరకు ఓకే.. ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే పార్టీని నడిపించేదెవరు? అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందట.

హైదరాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై ఫైట్ చేసే బాధ్యతను హరీష్‌రావుకి అప్పగించినట్టు సమాచారం. ఇక కవిత జిల్లా నాయకులతో సమావేశాలు, వివిధ విభాగాల నేతలను సమన్వయం చేయడం ఆమెకి అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కేడర్‌తో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల మాట.

మరో వార్త ఏంటంటే ఐదారుగురు ఎమ్మెల్యేలు కారు దిగిపోయేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అయితే కాంగ్రెస్, లేదంటే బీజేపీకి వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్లు అధికార పార్టీతో ఫైట్ చేయడమంటే ఆశామాషీ కాదని, దీనివల్ల తమ వ్యాపారాలు దెబ్బ తినే పరిస్థితి ఉందని అంటున్నారు. కేటీఆర్ జైలుకి వెళ్లిన మరుక్షణం నేతలు తమ ఇల్లు చక్కబెట్టుకోవడం ఖాయమని అంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వలసపోయే నేతలపై నోరు ఎత్తకుంటే ఉంటే బెటరని అంటున్నారు. దానిపై నోరు ఎత్తితే ప్రజల్లో మరింత చులకన అవుతామని, పార్టీని నిలబెట్టేందుకు కృషి చేయాలని పెద్దాయన సలహా ఇచ్చారట. మొత్తానికి రాబోయే రోజుల్లో కారు పార్టీలో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×