OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కొద్దిరోజుల తేడాతో, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటిటిలో జోరు అందుకుంటాయి. అటువంటి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘మిస్టర్ అండ్ మిస్‘ (Mr and Miss). ఈ మూవీలో ప్రేమికుల ప్రైవేటు వీడియో ఒకటి లీక్ అవుతుంది. దానిని వెతికే క్రమంలో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీకి అశోక్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీలో జ్ఞానేశ్వరి కాండ్రేగుల, శైలేష్ సన్నీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
శశి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా ముంబైలో జాబ్ చేస్తూ ఉంటుంది. తన ప్రియుడ్ని సర్ప్రైజ్ చేస్తూ హైదరాబాద్ కి వచ్చేస్తుంది. అయితే ప్రియుడు ఆమె ముందే, మరొక అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు. ఇదంతా ఇక్కడ కామన్ అని శశికి సర్ది చెప్తాడు. అయితే శశి అతడిమీద కోపంతో, అక్కడే ఉన్న శివ అనే వ్యక్తికి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. బాయ్ ఫ్రెండ్ అలా చేయడంతో, హీరోయిన్ కూడా అతనికి అలా చేసి చూపిస్తుంది. వీళ్ళిద్దరూ బ్రేకప్ అవుతారు. కొద్దిరోజుల తర్వాత శివ ఒక ఇంటర్వ్యూ కి వెళ్తాడు. అక్కడ శశి హెచ్ఆర్ గా శశి ఉంటుంది. శివ జాబ్ కి ఆమె హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ క్లోజ్ గా మూవ్ అవుతూ, ప్రేమించడం మొదలుపెడతారు. అలా ఒకరిని వదిలి ఒకరు ఉండలేక పోతారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతారు. అలా వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండగా, వీరి ఫోన్లోనే ఒక వీడియో కూడా రికార్డ్ అయిపోతుంది. ఒకరోజు హీరోకి జాబ్ పోతుంది. ఏ పని పాట లేకుండా హీరో ఇంట్లోనే ఉంటాడు.
అతని ప్రవర్తనతో విసిగిపోయిన శశి బ్రేకప్ చెప్తుంది. అయితే సెల్ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేయమంటుంది. అప్పటికే తన ఫోన్ పోగొట్టుకుని ఉంటాడు శివ. ఆ వీడియో ఎక్కడ బయట పడుతుందేమో అని, ఇద్దరూ చాలా భయపడతారు. చాలా చోట్ల వెతికి నా ప్రయోజనం లేకుండా పోతుంది. శివ ఫ్రెండ్ ఈ విషయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని, తనతో ఏకాంతంగా గడిపితే ఆ వీడియోని ఇస్తానని చెప్తాడు. అక్కడికి ఒంటరిగా వెళ్లిన ఆమెపై అఘాయిత్యం చేయాలనుకుంటాడు. అయితే శివ వచ్చి ఆమెను కాపాడుతాడు. చివరికి ఆ వీడియో వీళ్ళకు దొరుకుతుందా? వీళ్ళ ప్రేమ మళ్లీ చిగురిస్తుందా? ఇంతకీ ఆ ఫోన్ ఎవరు కొట్టేసి ఉంటారు? ఆ వీడియో బయటికి వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.