Big Stories

BRS : నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం.. అజెండా ఇదేనా..?

BRS : బీఆర్ఎస్ లెజిస్లేచర్‌ పార్టీ, పార్లమెంటరీ పార్టీల సమావేశం బుధవారం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. 20 రోజులు వ్యవధిలో మళ్లీ భేటీ ఏర్పాటు చేయడంపై ఆసక్తిని రేపుతోంది.

- Advertisement -

ఈ సమావేశంలో ఏయే అంశాలు చర్చిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. జూన్‌ 2 నుంచి జరిగే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చిస్తారని తెలుస్తోంది. గత నెలలో జరిగిన సమావేశంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దళిత బంధు పథకంలో కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటనలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

తాజా సమావేశంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ స్థితిగతులపైనా చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు జరిగే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనాలని ఆదేశించనున్నారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని మార్గనిర్దేశం చేయనున్నారు. తాజా సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గంతోపాటు అన్ని కార్పొరేషన్ల ఛైర్మన్‌లు కూడా పాల్గొనాలని కేసీఆర్ ఆదేశించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News