BigTV English

KTR on ORR Toll Lease: సిట్టింగ్ జడ్డితో విచారణకు రెడీ, చిట్ చాట్‌లో కేటీఆర్

KTR on ORR Toll Lease: సిట్టింగ్ జడ్డితో విచారణకు రెడీ, చిట్ చాట్‌లో కేటీఆర్

KTR on ORR Toll Lease: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టు వ్యవహారంపై నోరు విప్పారు మాజీ మంత్రి కేటీఆర్. దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలంటే సిట్టింగ్ జడ్జితోకానీ.. రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరగాలని కోరారు. శుక్రవారం అసెంబ్లీకి వచ్చిన ఆయన, మీడియాతో చిట్ చాట్ చేశారు.


నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టీవోటీ విధానంలో తాము డబ్బులను సేకరించామన్నారు. ప్రయివేట్ కంపెనీకి లబ్ది చేకూర్చినట్టు ఆరోపిస్తున్న ప్రభుత్వం, ఆ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయలేదన్నారు.

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ ఉందని, ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ విధానం దేశంలో ఇప్పటికే అమలులో ఉందన్నారు. దాని నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించామన్నారు.


ఆర్థిక వనరుల సమీకరణపై అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు చేసిందన్నారు కేటీఆర్. అమెరికా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చన్నారు. మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపులకు పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలన్నారు.

ALSO READ:  అసెంబ్లీలో దళిత స్పీకర్‌కు అవమానం.. క్షమాపణలు చెప్పాల్సిందే

పది వేల కోట్ల రూపాయల కోకాపేట కుంభకోణం అంటున్న భూముల అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ప్రతీది తనకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేశారు కేటీఆర్. అంతా కరెక్టుగా జరిగితే ఎందుకు కేటీఆర్ భయపడుతున్నారనే ప్రశ్నలు లేకపోలేదు.

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×