BRS Leaders Demand to Cancel GO Number 33: హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీఓ నంబర్ 33ను రద్దు చేయాలనే డిమాండ్‌తో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు.
బీఆర్ఎస్ నేతలు బయటకు వెళ్లకుండా భవనం వద్ద అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఇందులో కొంతమంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్‌వీ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు విద్యార్థి నేతలు ఉన్నారు.
మరోవైపు, స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలని మినిస్టర్ క్వార్టర్స్ ముందు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు అక్కడే బైఠాయించారు. జీఓ 33ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీఓ తీసుకురావడంతో తెలంగాణ ప్రాంత విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని ఆరోపించారు.
జీఓ 33 తో ఇతర రాష్ట్ర విద్యార్థులకు కన్వీనర్ కోటలో సీట్లు అమ్ముకునే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ జీఓతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్థి స్థానికుడేనని, రాష్ట్ర ప్రభుత్వం జీఓ 33పై సుప్రీంకోర్టు వేసిన అప్పీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: కౌషిక్ రెడ్డితో గొడవ.. అరెకపూడికి షాక్ ఇచ్చిన పోలీసులు
జీఓ 33ను ఉపసంహరించుకోవాలని, లేకుంటే రాష్ట్ర విద్యార్థులు కన్వీనర్ కోటలో వందల సీట్లు నష్టపోతారన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదని, ఇతర రాష్ట్రాల్లో నీట్ కౌన్సెలింగ్ రెండో దశకు చేరుకుందన్నారు.