BigTV English
Advertisement

Jabardasth Team: వినాయకచవితి వేడుకల్లో అసభ్య పాటలకు జబర్దస్త్ టీం డ్యాన్స్.. పట్టించుకోని పోలీసులు

Jabardasth Team: వినాయకచవితి వేడుకల్లో అసభ్య పాటలకు జబర్దస్త్ టీం డ్యాన్స్.. పట్టించుకోని పోలీసులు

Jabardasth Team: గణేష్ నవరాత్రులంటే.. భక్తితో దేవుడికి పూజలు చేయడం, నియమ, నిష్టలతో ఉండటం.. ఇవి ఒకప్పటి సంగతి. ఇప్పుడు వీధికి ఒకటి.. కాదు కాదు.. కనీసం రెండు, మూడు మండపాలనైనా పెడుతున్నారు. సరే దేవుడిపై భక్తితో పెట్టారనుకుందాం. కానీ.. అక్కడ భక్తితో పూజలు, నియమంగా ఉండటం, సాంప్రదాయ కార్యక్రమాలు వంటివి కనిపించడం లేదు. అంతా డీజే సౌండ్లు, అశ్లీలత్వంతో ఉండే పాటలు.. వాటికి తగ్గ డ్యాన్సులు.


అసలు ఈ వినాయక చవితి వేడుకలను చూసి.. ఈ పూజలు నాకొద్దు బాబోయ్ అని పారిపోయేంతలా చేస్తున్నారు కొందరు. భక్తి లేదు.. కేవలం చేశామన్న పేరుకోసం చేసేవారున్నారు. ఉదయం 6 గంటలకు మొదలుపెడితే.. అర్థరాత్రి 12 గంటల వరకూ కూడా కొన్ని ప్రాంతాల్లో సౌండ్ సిస్టమ్ లు ఆగడం లేదు. ఆ సౌండ్ కు చుట్టుపక్కల ఉన్నవారికి లేనిపోని తలనొప్పులు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు ? అని తిట్టుకుంటారు. ఆగండి.. ఏకంగా జబర్దస్త్ టీమ్ నే దింపి.. ఇష్టమొచ్చినట్లు డ్యాన్సులు చేయించినా రాలేదు. సౌండ్ సిస్టమ్ కే పోలీసులు వచ్చేస్తారా ఏంటి ?

Also Read: అంజలి కోసం మందు మానేసిన రణవీర్‌ – అమర్‌ ఇంట్లో బాంబు పేలుస్తానన్న అరవింద్‌


తాజాగా.. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో వినాయకచవితి నవరాత్రి వేడుకల్లో భాగంగా జబర్దస్త్ టీమ్ తో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. సరే వచ్చిన వాళ్లు కామెడీ స్కిట్లు చేసి నవ్విస్తే ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ.. “ఆ వీధి కుర్రోడు ఈ వీధికొచ్చాడు..” అనే పాటకు చిందులేశారు. లేడీ గెటప్ లో ఉన్న ఆర్టిస్టే డ్యాన్స్ చేసినా.. దేవుడి పూజలు నిర్వహించే చోట ఇలాంటి పాటలు, డ్యాన్సులు ఏంటని స్థానికులు వాపోయారు. ఇలాంటివి యువతను రెచ్చగొట్టేలా ఉన్నాయని, పోలీసులు కనీసం వీటిని నిర్వహించకుండా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఇక్కడ విషయం.. ఒక్క కాట్రావులపల్లిలో జరిగిన ఈవెంట్ గురించి కాదు. అక్కడ జరిగిన వీడియో బయటికి వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ.. దాదాపు ప్రతి వినాయకమండపం వద్ద ఇలాంటి పాటలు, డ్యాన్సులే నిర్వహిస్తున్నారు. దేవుడి మీద భక్తి, శ్రద్ధ, ఇష్టంతో నవరాత్రులు చేస్తున్నారో, వారి ఎంజాయ్ మెంట్ కోసం దేవుడిని అడ్డం పెట్టుకుని చేస్తున్నారో వాళ్లకే తెలియాలి.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×