Tollywood:సాధారణంగా సినీ సెలబ్రిటీలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వారు చేసే సినిమాలు కావచ్చు.. వారి లైఫ్ స్టైల్ కావచ్చు.. వారిలో ఏదో ఒక అంశం నచ్చే వారికే అభిమానులుగా మారిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ అభిమానులకే ఇష్టమైన సెలబ్రిటీలు కాదు ఆ సెలబ్రిటీలకు కూడా ఇష్టమైనవారు ఉంటారనడంలో సందేహం లేదు. ఇప్పటికే రామ్ చరణ్ (Ram Charan) ను మొదలుకొని యంగ్ హీరోల వరకు చాలామంది తమకు ఇష్టమైన హీరోల గురించి, హీరోయిన్ల గురించి బయట పెడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు అందరిలాగే తనకు కూడా ఫేవరెట్ హీరోయిన్ ఒకరు ఉన్నారని, తాను అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah).
ప్రమోషన్స్లో అభిప్రాయాలు పంచుకుంటున్న తమన్నా..
తమన్నాకి టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంత ఫ్యాన్ ఫాలో అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రేక్షకులే కాదు సినీ సెలెబ్రెటీలు కూడా ఈమెకు అభిమానులుగా మారిపోయారు. అలాంటి ఈమె తాజాగా తనకు ఒక హీరోయిన్ అంటే ఇష్టం అని చెప్పి తన అభిప్రాయాన్ని పంచుకుంది. మరి తమన్నాకు ఇష్టమైన ఆ హీరోయిన్ ఎవరు ? ఆమెలో ఏం నచ్చి ఈమె అభిమానిగా మారిపోయింది? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. తమన్నా తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. ఈనెల 18వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాకు కథనం, నిర్మాణం, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలన్నింటిని సంపత్ నంది తీసుకున్నారు. దర్శకత్వం అశోక్ తేజ చేస్తున్నారు. ఇంకా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న తమన్నా.. అందులో భాగంగానే తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరోయిన్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
సాయి పల్లవి అంటే అందుకే ఇష్టం – తమన్నా
ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నాకు “మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు ?” అనే ప్రశ్న ఎదురవడంతో… తమన్నా మాట్లాడుతూ..” నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఆమె చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు ఆమె స్పేస్ లో ఆమె ఇండివిజువల్ గా ఉంటుంది. యాక్టింగ్, డాన్స్ ఆమె ఒక ఆల్ రౌండర్. చాలా యూనిక్ గా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.. మొత్తానికి అయితే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపి సాయి పల్లవి అభిమానుల మనసు దోచుకుంది. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Nani: నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన నాని..ఒక్క క్షణం నమ్మలేకపోయాను..!
సాయి పల్లవి కెరియర్..
ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి.. తెలుగులో శేఖర్ కమ్ముల హీరోగా వచ్చిన ‘ఫిదా’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత చాలా సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ అలరిస్తోంది. తాను పెట్టుకున్న హద్దులను చెరిపేయకుండా.. గ్లామర్ జోలికి వెళ్లకుండా నటనతోనే మెప్పిస్తూ లేడీ పవర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది సాయి పల్లవి.