BigTV English

BRS: మంత్రి, ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్.. మొగిలయ్య సాక్షిగా డైలాగ్ వార్..

BRS: మంత్రి, ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్.. మొగిలయ్య సాక్షిగా డైలాగ్ వార్..

BRS: అనేక మంది బీఆర్ఎస్ నేతల్లో లుకలుకలు ఉన్నాయి. అధికార పార్టీలో ఉండటంతో అవన్నీ బయటకు రావడం లేదు. కానీ, లోలోన ఒకరంటే ఒకరు రగిలిపోతున్నారు. కారు ఓవర్ లోడ్ కావడంతో.. బండి మొండికేస్తోంది. కేసీఆర్ భయానికి నేతలెవరూ బయటపడటం లేదుగానీ.. లేదంటేనా.. రచ్చ రంభోలే. తాజాగా, ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల మధ్య కోల్డ్ వార్ మరోసారి వెలుగు చూసింది. అందుకు, పద్మశ్రీ గ్రహీత మొగిలయ్యనే సాక్షిగా నిలిచారు.


దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో ఇంటి స్థలం పంపిణీ చేసింది ప్రభుత్వం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనకు ఇంటి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సైతం హాజరయ్యారు. అదే వేదికపై నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై.. ఆక్రోషం వెళ్లగక్కారు ఎమ్మెల్యే బాలరాజు. ఇంతకీ మేటర్ ఏంటంటే…

మొగిలయ్యకు ఇంటి స్థలం పేపర్లు ఇస్తున్న విషయం స్థానిక ఎమ్మెల్యే అయిన గువ్వల బాలరాజుకు ముందే చెప్పలేదట. అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి.. కార్యక్రమానికి పిలిచారట. ఇలా ముందస్తు సమాచారం లేకపోవడంపై ఎమ్మెల్యే బాలరాజు బాగా ఫీల్ అయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావాలనే తనకు ప్రాధాన్యం లేకుండా చేశారని ఆగ్రహించారు. ఇదే విషయంపై వేదికపైనే అసహనం వ్యక్తం చేశారు. అసలు, మొగిలయ్య గురించి ప్రపంచానికి తెలిసేలా చేసిందే తానని.. అలాంటి తనను సంప్రదించకుండా.. మీకు మీరే ఎలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ మండిపడ్డారు.


ఆగారా? అక్కడితోనైనా ఆగారా? లేదే. మొగిలియ్య ఇంటి స్థలంపై ఓ కిరికిరి కూడా పెట్టారు. కొందరు ప్రముఖులకు జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ లో స్థలాలు ఇచ్చి.. మొగిలయ్యకు మాత్రం బీఎన్ రెడ్డి నగర్ లో స్థలం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూ స్వపక్షంలో విపక్షంగా మారారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

ఇదంతా చూస్తున్న మొగిలయ్య.. తనకెందుకులే అనుకుంటూ మెళ్లిగా వేదిక మీద నుంచి జారుకున్నారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×