Brahmamudi serial today Episode: ఇంటి పెత్తనం తనకు వద్దని అపర్ణ దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్న కావ్యకు ఆ పెత్తనం చేయడంలో ఉన్న సీక్రెట్స్ చెప్తుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని అపర్ణ చెప్పగానే వాళ్లందరూ మిమ్మల్ని అడిగినంత శాంతంగా నన్ను అడుగుతున్నారు అనుకున్నావా..? ఏం తీసుకురాపో ఏయ్ డబ్బులు ఇవ్వు అంటూ అడుగుతున్నారు. నా వల్ల గొడవలు జరగడం ఇష్టం లేక ఎవరినీ ఏమీ అనలేకపోతున్నాను అంటుంది. దీంతో కావ్య నువ్వు ఓడిపోయి వెనకంజ వేస్తే అది నాకు అవమానం.. ధైర్యంగా నిలబడు నీ వెనక నేనున్నాను అంటూ తాళాలు కావ్యకు ఇచ్చి పంపిస్తుంది అపర్ణ.
ఈ ఇంట్లో డబ్బులు సంపాదించడం ఇంత ఈజీ అని నాకు ఇంత వరకు తెలియదు. తాతయ్య పేరు చెప్పి అడిగితే డబ్బులు వస్తాయనుకుంటే.. ఎప్పుడో ఈ పని చేసేవాడిని.. ఇక నా ఫ్రెండ్స్ అందరినీ రంగంలోకి దింపి డబ్బులు కొల్లగొడతాను అనుకుంటూ తన ఫ్రెండ్‌కు ఫోన్ చేసి రేపు మా ఇంటికి వచ్చి మా తాతయ్య నీ చదువుకు 50 లక్షలు ఇస్తానన్నారు అని డబ్బులు అడుగు.. తర్వాత నీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను అని చెప్తాడు. ఇంతలో స్వప్న వచ్చి రాహుల్‌ను తిడుతుంది. ఇంత దద్దమ్మవు నన్నెలా పడగొట్టావు అంటుంది.
రుద్రాణి వచ్చి స్వపన్నను తిడుతుంది. నా కొడుకేం తెలివితక్కువ వాడు కాదు.. ఇప్పుడు వాడు జీనియస్ అంటుంది. అవువనా నీ కొడుకు ఏం చేశాడో తెలిస్తే జీనియసా కాదా నువ్వే డిసైడ్ చేస్తావు అంటుంది స్వప్న.. ఏం చెశాడో ముందు చెప్పు అని రుద్రాణి అడగ్గానే.. ఆ పాడు ఆలోచన నేనెందుకు చెప్పడం మీ కొడుకునే అడగండి అనగానే రాహుల్ తన ప్లాన్ చెప్పగానే రుద్రాణి కోపంగా చూస్తుంది. స్వప్న వెళ్లిపోతుంది. రాజ్ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ 100 కోట్ల గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో కావ్య వస్తుంది. రాత్రి కాఫీ తీసుకుని వెళితే తిట్టాడు. ఇప్పుడు ఈయన ముఖం చూస్తుంటే చెడామడా తిట్టేలా ఉన్నాడు ఎందుకులే అని సైలెంట్‌గా కిచెన్ లోకి వెళ్తుంది.
రాజ్ కోపంగా కావ్యను ఆపి ఏంటి అక్కడ చూస్తున్నావు నేను ఇక్కడ పిలిస్తున్నాను అంటే ఏం లేదు ఇక్కడ కూడా మీరు గీత గీసారేమో నేను పొరపాటున దాటానేమో అని చూస్తున్నాను అంటుంది కావ్య. ఏంటి జోకా.. చెట్టంత మనిషి ఎదురుగా ఉన్నాడు. పొద్దునే లేచాడు.. రెడీ అయ్యాడు. వాడి ముఖం మీద కాఫీ అయినా పడేయాలి అని తెలియదా..? అంటాడు రాజ్. ముఖం మీద కాఫీ వేయడం నాకు రాదండి. రాత్రి కాఫీ ఇస్తే అరిచారు.. ఇప్పుడు ఏమంటారో అని ఇవ్వలేదు అంటుంది కావ్య.. అంటే ఎప్పుడూ నేను తిట్టే వాడిలా ఉంటానా..? అని రాజ్ ప్రశ్నించగానే.. కావ్య పాత విషయాలు గుర్తు చేస్తుంది.
ఇప్పుడు సోదంతా ఎందుకు.. ముందు వెళ్లి కాఫీ తీసుకురాపో అని చెప్పగానే సరేనని కావ్య వెళ్లిపోతుంది. ఇంతలో రాజ్‌కు ఫ్రెండ్ ఫోన్ చేసి నేను మీ ఇంటి బయటే ఉన్నాను లోపలికి రమ్మంటారా..? అని అడగ్గానే లేదు నేనే బయటకు వస్తాను అని రాజ్ బయటకు వెళ్తాడు. బయటకు వెళ్లిన రాజ్ తన ఫ్రెండుతో 100 షూరిటీ తీసుకున్న కంపెనీ ఓనరు గురించి ఎక్వైరీ ఎంత వరకు వచ్చిందని అడుగుతాడు. వాడు చాలా ప్లాన్‌గా బ్యాంకాక్ వెళ్లాడు. అక్కడ కూడ ఫేక్ అడ్రస్ ఇచ్చాడు. అక్కడి నుంచి వేరే ఏదైనా కంట్రీకీ వెళ్లి ఉండొచ్చు అని చెప్తాడు. ఇంతలో కావ్య కాఫీ తీసుకుని వచ్చి ఏవండి కాఫీ అని చెప్పగానే నీకసలు బుద్ది ఉందా.. ఇక్కడ ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే.. ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది.
వచ్చి డిస్టర్బ్ చేయడమేనా వెళ్లు అంటూ తిట్టగానే.. కావ్య సారీ చెప్పి వెళ్లిపోతుంటే.. అపర్ణ చూసి రాజ్‌ను కోపంగా పిలుస్తుంది. వచ్చిన వ్యక్తి తర్వాత కలుస్తాను అని వెళ్లిపోతాడు. పరాయి మగవాడి ముందు నీ భార్యను అవమానిస్తావా..? ఇష్టం వచ్చినట్టు అరుస్తావా..? అన్నట్టల్లా పడుతుంది కదాని ఎవరి ముందు పడితే వాళ్ల ముందు తిడతావా..? నీ చదువు నీకు ఇదే నేర్పిందా..? అంటూ అపర్ణ తిట్టగానే సారీ అమ్మా అనుకోకుండా అరిచేశాను అంటాడు రాజ్. ఆ మాట నాకు కాదు చెప్పాల్సింది నీ భార్యకు.. అనగానే సారీ కళావతి మమ్మీ చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. నిజంగానే అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి వెళ్లిపోతాడు. ఏమైంది వీడికి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని అపర్ణ అనుమానిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా..? అని కావ్య అడుగుతుంది. అవునని చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది.
తర్వాత రూంలో కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్న రాజ్ దగ్గరకు కావ్య వెళ్లి ఎందుకు కంగారుపడుతున్నారు. మీరేదో దాస్తున్నారు ఏంటది చెప్పండి అని అడుగుతుంది. రాజ్ కోపంగా కావ్యను తిడతాడు. కావ్య వెళ్లిపోతుంది. తర్వాత బ్యాంకు ఆఫీసర్లు ఇంటికి వచ్చి సీతారామయ్య పెట్టిన 100 కోట్ల షూరిటీ గురించి చెప్తారు. అందరూ షాక్ అవుతారు. రాజ్ వచ్చి అడ్డుకున్నా.. నీకు టైం ఇచ్చినా రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు మీ ప్రాపర్టీస్ మొత్తం జప్తు చేస్తాం అంటారు. నోటీసు ఇవ్వకుండా జప్తు ఎలా చేస్తారు అని సుభాష్ అడగ్గానే మీ ఆఫీసు ఎంట్రన్స్ లోనే నోటీసు పెట్టామని చెప్తారు. దీంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణి ఇద్దరూ కలిసి సీతారామయ్యను తిడతారు. ఇక మనం వీధిన పడాల్సిందే అంటూ ధాన్యలక్ష్మీ తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?