Big Stories

MLC Kavitha: విచారణకు రాలేను.. సీబీఐకు కవిత లెటర్..

 

- Advertisement -

MLC Kavitha latest news

- Advertisement -

MLC Kavitha latest news(TS today news): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకు లెటర్ రాశారు. విచారణకు రాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు ఇచ్చిన 41ఏ నోటీసులు ఉపసంహించుకోవాలని కేంద్ర దర్యాప్తు సంస్థను ఆమె కోరారు. గతంలో తనకు సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తాజాగా 41ఏ సెక్షన్ నోటీసు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఇది పూర్తి విరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సోమవారం విచారణకు హాజరుకావాలని తాజాగా సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకు లేఖ ద్వారా సమాచారం పంపారు. ఆ రోజు ముందే ప్లాన్ చేసుకున్న ప్రోగామ్స్ తనకు ఉన్నాయని తెలిపారు. సీబీఐ విచారణకు వర్చువల్ పద్ధతిలో హాజరుకావడానికి అభ్యంతరం లేదన్నారు. ఈ పద్ధతి ద్వారా సీబీఐకు కావాల్సిన సమాచారం ఇస్తానన్నారు.

Read More: హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన డిప్యూటీ మేయర్..

సీబీఐకు కొన్ని ప్రశ్నలు వేశారు ఎమ్మెల్సీ కవిత. సెక్షన్‌ 41ఏ కింద తనకు ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో క్లారిటీ లేదన్నారు. నోటీసు జారీ చేసిన సమయం కూడా అనుమానాలు కలిగిస్తోందని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News