Shiva Raj Kumar:కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు శివ రాజ్ కుమార్ (Shiva Raj Kumar). ఇక ఈయన నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, తమిళ్ హీరోల కోరిక మేరకు వారి సినిమాలలో కూడా నటిస్తూ సౌత్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ఇక ఈయన ఎవరో కాదు ప్రముఖ సినీనటుడు, రాజకీయవేత్త డాక్టర్ రాజ్ కుమార్ వారసుడే. 62 ఏళ్ల శివ రాజ్ కుమార్ చెన్నైలో పుట్టి పెరిగారు. చెన్నైలోని ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిలిం అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో చలనచిత్రంలో శిక్షణ పొంది, ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు.
శివరాజ్ కుమార్ కి క్యాన్సరా..?
ఇటీవల ‘జైలర్’ చిత్రంలో రజనీకాంత్ (Rajinikanth)స్నేహితుడిగా, నరసింహా గా నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ధనుష్ (Dhanush) నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ లో కూడా కీలకపాత్ర పోషించారు. అలాగే ‘దళపతి 69’ సినిమాలో కూడా శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే గతంలో బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ ‘ఆర్.సీ.16’ లో కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నటుడిగానే కాకుండా గాయకుడిగా కూడా ప్రసిద్ధి చెందిన ఈయన దాదాపు 20కి పైగా పాటలు పాడారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయనకు క్యాన్సర్ ఉందని, చికిత్స కోసం అమెరికా వెళ్లబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది.
స్పందించిన శివరాజ్ కుమార్..
ఈ వార్త గురించి శివరాజ్ కుమార్ ఇంతకుముందు కూడా మాట్లాడుతూ..” నాకు ఒక వ్యాధి ఉందన్నది నిజమే. దానికి చికిత్స కోసం నేను అమెరికా వెళుతున్నాను. కానీ అది క్యాన్సర్ కాదు. ఆ వ్యాధి ఏమిటో నాకు కూడా తెలియదు. కాబట్టి ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కచ్చితంగా నేను ఆరోగ్యంగా తిరిగి వస్తాను” అని తెలిపారు. అయితే మరి ఆయనకు క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదు అని సమాచారం. ఇకపోతే చికిత్స కోసం అమెరికా వెళుతున్న నేపథ్యంలో ఆయన నటించాల్సిన చిత్రాల నుంచి కూడా తాజాగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.
తమ్ముడు మరణం నుంచి తేరుకోని ఫ్యాన్స్..
ఇక శివరాజ్ కుమార్ విషయానికి వస్తే.. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు అన్నింటినీ కూడా ఆయన అనాధాశ్రమానికి రాసిచ్చేశారనే వార్త వచ్చింది. కాని దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా కొన్నేళ్ల క్రితం శివరాజ్ కుమార్ సోదరుడు పునీత్ రాజ్ కుమార్ జిమ్లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మరణించారు. పునీత్ రాజకుమార్ మరణం నుంచి ఇంకా కోలుకోని కన్నడ ప్రేక్షకులకు శివరాజ్ కుమార్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయనకు అంతా మంచి జరగాలని మళ్లీ ఆరోగ్యంతో తిరిగి రావాలి అని కోరుకుంటున్నారు.