BRS: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత చిచ్చు తారాస్థాయికి చేరిందా? కవిత వ్యాఖ్యలతో అసలు విషయాలు బయటకు వచ్చాయా? ఇంతకీ ఆ ముగ్గురు నేతలెవరు? అంతర్గత సమస్యలను పరిష్కరించలేక కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యారా? అవుననే అంటున్నారు రాజకీయ నేతలు.
బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న లొల్లి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. కారు షెడ్డుకు వెళ్లడానికి ముగ్గురు నేతలు కారణమని ఆదివారం మీడియా ముందు కవిత ఓపెన్‌గా చెప్పారు. నల్గొండ జిల్లాకి చెందిన ఓ నేత పేరు బయటపెట్టారు. మిగతా ఆ ఇద్దరు ఎవరు? కేటీఆర్, హరీష్‌రావు, సంతోష్‌కుమార్ వారిలో ఈ ముగ్గురి ఎవరు? అన్న డౌట్ అప్పుడే పార్టీలో చర్చ మొదలైంది.
తొలిసారి పార్టీలో జరిగిన.. జరుగుతున్న వ్యవహారాలపై నోరువిప్పారు కవిత. పార్టీలో ఏం జరుగుతుందో తనకు ఎప్పటికప్పుడు తెలుస్తోందని చెప్పకనే చెప్పారు. ఈ లెక్కన పార్టీ నేతలు కొందరు కవిత వెనుక ఉన్నట్లు అర్థమవుతోంది. పార్టీ సంక్షోభం తీవ్రమైతే కొందరు నేతలు కవిత వైపు మొగ్గు చూపే అవకాశముందన్న వార్తలు సైతం లేకపోలేదు.
ఇదే క్రమంలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు కవిత. ఆయన్ని లిల్లీపుట్ అంటూ వ్యాఖ్యానించారు. ఆయనకు సొంతంగా అస్తిత్వం లేదన్నారు. కవిత వ్యాఖ్యలపై ఆయన కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి తన జోహార్లని వ్యాఖ్యానించారు.
ALSO READ: మళ్లీ భారీ వర్షాలు.. ముఖ్యంగా ఆ ప్రాంతాల వారు జాగ్రత్త
కవిత ఉపయోగిస్తున్న పదాలను సీఎం రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ మాత్రమే వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. కవిత మాటల వెనుక కేసీఆర్ ప్రత్యర్థులు ఉన్నారని తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు సదరు ఎమ్మెల్యే. పార్టీ అంతర్గత వ్యవహారాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారాయన.
ఇళాంటి సమయంలో పెద్దానయ నోరు విప్పితే పార్టీ డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారట. అందులో సైలెంట్‌గా ఉన్నారని కొందరు నేతల మాట. ఆస్తుల కోసమే అన్న-చెల్లెలు పంచాయతీ నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ పంచాయతీ ముగింపు ఇవ్వలేక KCR ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యారని వ్యాఖ్యానించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
ప్రజా సమస్యలపై నోరు ఎత్తని బీఆర్ఎస్, కేవలం బనకచర్ల వ్యవహారాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాన్ని మరుగున పడే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు ప్రత్యర్థులు. ఇదిలా కంటిన్యూ అయితే ఆ పార్టీలో ఉన్న నేతలు బయటకురావడం ఖాయమన్నది కొందరు కాంగ్రెస్-బీజేపీ నేత మాట. ఈ వ్యవహారాన్ని కేసీఆర్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.
ఆస్తుల కోసమే
అన్న + చెల్లెలు పంచాయతీఈ ఆస్తుల పంచాయతీ తెంచలేకే KCR ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడు
• @Bmaheshgoud6666 pic.twitter.com/NniwxEffLl
— Congress for Telangana (@Congress4TS) August 3, 2025