BigTV English

OTT Movie : గతం మర్చిపోయే భార్య… ఈ భర్త కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగవు

OTT Movie : గతం మర్చిపోయే భార్య… ఈ భర్త కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగవు

OTT Movie : ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఎందుకంటే ఈ సినిమాలు చూస్తే వచ్చే ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేనిది. అటువంటి సినిమాల ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయే సినిమాలను చూస్తున్నంత సేపు మనసుకి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అటువంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ ఒకటి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ మీడియా

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ పేరు “ది వౌ” (The Vow). ఈ మూవీలో హీరోయిన్ ఒక ప్రమాదంలో గతాన్ని మర్చిపోతుంది. ఆ గతాన్ని తిరిగి రప్పించే ప్రయత్నం హీరో చేస్తాడు. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

హీరో, హీరోయిన్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తరువాత కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీగా జరుగుతున్న వీళ్ళ జర్నీ అనుకోకుండా యూటర్న్ తీసుకుంటుంది. హీరో, హీరోయిన్ ఒక కారులో ఉండగా, వెనకనుంచి ఒక లారీ యాక్సిడెంట్ చేస్తుంది. అప్పుడు హీరో సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో గాయాలు తక్కువ అవుతాయి. హీరోయిన్ సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడంతో, తలకు బలమైన గాయం తగిలి గతం మరిచిపోతుంది. హాస్పిటల్లో కొద్దిరోజులు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. తన భర్తని కూడా గుర్తుపట్టలేని విధంగా ఉంటుంది. హీరో నేను నీ భర్తను అని చెప్తున్నా నాకు ఏం గుర్తుకు రావట్లేదని అంటూ ఉంటుంది. హాస్పిటల్ కి హీరోయిన్ తల్లిదండ్రులు కూడా వస్తారు. వారిని కూడా ఆమె గుర్తుపట్టలేదు. డాక్టర్ హీరోతో మాట్లాడుతూ ఆమె గతంలో మీతో ఎలా ఉందో అలా ఉంటే గతం గుర్తొచ్చే అవకాశాలు తొందరగా ఉంటాయని చెప్తాడు. ఈ విషయం హీరోయిన్ కి చెప్పి బతిమాలుకుంటాడు. హీరోయిన్ మొదట అతనితో ఉండటానికి ఒప్పుకోకపోయినా, అతడు బతిమాలాడంతో ఒప్పుకుంటుంది. హీరో ఆమెకు గతం గుర్తు తేవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ అవన్నీ వృధా అయిపోతుంటాయి.

మరోవైపు హీరోయిన్ తల్లిదండ్రులు ఆమెను తనతో పాటు వచ్చేయాలని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఒకరోజు హీరోయిన్ చెల్లి వెడ్డింగ్ రిసెప్షన్ లో హీరోని, హీరోయిన్ తల్లిదండ్రులు హేళన చేస్తూ మాట్లాడతారు. హీరోయిన్ కూడా గతం గుర్తు లేకపోవడంతో అవేమీ పెద్దగా పట్టించుకోదు. హీరోయిన్ మాజీ బాయ్ ఫ్రెండ్ హీరోతో అసభ్యంగా మాట్లాడటంతో హీరో అతనితో గొడవ పడతాడు. అప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి ఇలా చేయడం తప్పు అని హీరోతో గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడు హీరో నేను నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పి, మీ తల్లిదండ్రులతో నువ్వు హ్యాపీగా ఉండు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ని మాత్రం మర్చిపోలేక పోతాడు. ఒకరోజు హీరోయిన్ తన తండ్రి చేసిన ఒక తప్పును తెలుసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని పరిణామాలు జరుగుతాయి. చివరికి హీరోయిన్ కి గతం గుర్తుకు వస్తుందా? హీరోయిన్ తండ్రి చేసిన తప్పేమిటి? హీరో, హీరోయిన్ ని వదిలి ఉండగలుగుతాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ ని తప్పకుండా చూడండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×