E-Paper
Advertisement

Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు.. వనదేవలకు పూజలు-గద్దెలను పునఃప్రారంభం

Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు.. వనదేవలకు పూజలు-గద్దెలను పునఃప్రారంభం
Advertisement

Medaram: మేడారంలో గద్దెలు-ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పునఃప్రారంభించారు.ఆ తర్వాత కుటుంబంతో కలిసి వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

మేడారంలో రెండో రోజు సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

మేడారం టూర్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండో‌రోజు సోమవారం ఉదయం వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్ళతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు  ఆదివాసీలు. సుమారు 101 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం, నూతనంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి.

ఆ తర్వాత వన దేవతల గద్దెల వద్ద తొలి మొక్కు సమర్పించారు. కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి పూజలు చేశారు. సమ్మక్క తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వనదేవతలకు మొక్కులు పూర్తయిన తర్వాత గద్దెల ప్రాంగణంలో సీఎం రేవంత్ కుటుంబ సభ్యులకు, మంత్రులకు దేవతల ప్రసాదం, చీరె సారె బహుకరించారు మంత్రి సీతక్క.

Advertisement

వనదేవలకు పూజలు-గద్దెలను పునఃప్రారంభించిన సీఎం దంపతులు

సీఎం రేవంత్‌రెడ్డి, తన మనవడు రేయాన్ష్‌తో కలిసి తులాభారం వేసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి బరువుకు సమానమైన 68 కిలోల బెల్లాన్ని వన దేవతలకు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

కుంభమేళా తరహాలో మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో  సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన పూర్తి అయ్యింది. దీంతో అక్కడి నుంచి
హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దావోస్ వెళ్లనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా సీఎం టూర్ కొనసాగుతోంది.

ALSO READ:  దేశంలో తొలి ముఖ్యమంత్రిగా రికార్డు.. హార్వర్డ్ స్టూడెంట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×