BigTV English

MLA Jagadish Reddy Suspension : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి.. తెలంగాణ అసెంబ్లీలో చర్చ

MLA Jagadish Reddy Suspension : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి.. తెలంగాణ అసెంబ్లీలో చర్చ

MLA Jagadish Reddy Assembly Suspension | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు (Telangana Assembly Session) ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే.. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ విషయాన్ని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఎమ్మెల్యేలు సభలో లేవనెత్తారు. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని.. స్పీకర్ ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. “జగదీష్ రెడ్డి మిమ్మల్ని ఏకవచనంతో మాట్లాడలేదు. ఆయన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదు. స్పీకర్ అంటే మాకు గౌరవం ఉంది. సభా సంప్రదాయాలు పాటించాలని మా నాయకుడు కేసీఆర్ ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటారు. జగదీష్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది” అని హరీష్ రావు సభలో చెప్పారు.


Also Read:  జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్?

ఆ తర్వాత.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ మాట్లాడారు. అలాగే.. గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. ఆ తర్వాత, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. విభజన చట్టంలో భాగంగా 10 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఈ పేరు మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


స్పీకర్‌ను ప్రత్యేకంగా కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో మరో ఆసక్తికరమైన పరిణామం నమోదైంది. ఈ నేపథ్యంలో, శనివారం సభ ప్రారంభమయ్యే ముందు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు హరీష్ రావు, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన ఛాంబర్‌లో కలిశారు. ఆ తర్వాత.. వారు తమ పార్టీ ఎమ్మెల్యే, శాసన సభ సభ్యుడు జగదీశ్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ గురించి జగదీశ్ రెడ్డి ఏక వచనంతో మాట్లాడలేదని, అందువల్ల ఆయనపై సస్పెన్షన్ విధించడం అన్యాయమని సవివరంగా వివరించారు. అలాగే, జగదీశ్ రెడ్డి సభా నియమాలను ఎక్కడా ఉల్లంఘించలేదని కూడా తెలిపారు. వెంటనే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ స్పీకర్‌ను కోరారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×