BigTV English

hydra vs cobra: రెడ్ బుక్ లాగా పింక్ బుక్.. హైడ్రా లాగా కోబ్రా..

hydra vs cobra: రెడ్ బుక్ లాగా పింక్ బుక్.. హైడ్రా లాగా కోబ్రా..

ఇటీవల రెడ్ బుక్ లాంటి పింక్ బుక్ తెస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత. తాజాగా బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీకి రెడ్డి తాము అధికారంలోకి వచ్చాక హైడ్రా లాగా కోబ్రా చట్టం తీసుకొస్తామన్నారు. కోబ్రా తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన భూములకు విముక్తి కల్పిస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు.


కోబ్రా ఎందుకు..?
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండే అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేయడమే ఓ సంచలనం. హైడ్రాని మెచ్చుకునేవారు ఉన్నారు, అదే సమయంలో హైడ్రాతో ఇబ్బందులు పడుతూ విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు. కానీ సామాన్య జనం మాత్రం హైడ్రా వల్ల సంతోషంగా ఉన్నారు. ఈ విషయం ఇటీవల చాలా సందర్భాల్లో రుజువైంది. అయితే హైడ్రాకు పేరు రావడం ప్రతిపక్ష బీఆర్ఎస్ కి మాత్రం ఇష్టం లేదు. అందుకే పదే పదే హైడ్రాపై అసత్య ఆరోపణలు చేశారు. హైడ్రా వల్ల సామాన్యులు నష్టపోతున్నారని అన్నారు. తాజాగా హైడ్రాకి పోటీగా కోబ్రాని తీసుకొస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత పట్లోళ కార్తీక్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ ని కబ్జా చేస్తున్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తాము వారి కబ్జా చెరనుంచి నగరాన్ని కాపాడతామని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు కబ్జా చేసిన వాటిని తిరిగి తెచ్చేందుకు తాము కోబ్రాని తీసుకొస్తామన్నారు.

పింక్ బుక్ కూడా..
ఇటీవల ఎమ్మెల్సీ కవిత కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని కాకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ రెడ్ బుక్ హాట్ టాపిక్ గా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ప్రతిపక్ష నేతల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి ప్రతిగా తాము కూడా అన్ని లెక్కలు రాసుకుంటున్నట్టు వైసీపీ నేతలు హెచ్చరించడం విశేషం. సరిగ్గా ఇలాంటి హెచ్చరికలే చేశారు కవిత. రెడ్ బుక్ లాగా తాము పింక్ బుక్ తెస్తామంటున్నారు. కాంగ్రెస్ నేతలు చేసిన తప్పులన్నిట్నీ పింక్ బుక్ లో నోట్ చేస్తున్నట్టు తెలిపారామె. తాను కేసీఆర్ అంత మంచిదాన్ని కాదని, రౌడీ టైప్ అంటూ గర్వంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే పింక్ బుక్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు కవిత.


జనం హర్షిస్తారా..?
పింక్ బుక్, కోబ్రా అని చెబితే ప్రజలు హర్షిస్తారా..? తాము అధికారంలోకి తిరిగొస్తాం, రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగంగా ఇలా చెబుతుంటే ప్రజలు సమర్థిస్తారా..? అధికారంలోకి కచ్చితంగా వస్తామని చెప్పడం వరకు బాగుంటుంది, అదే సమయంలో అధికారంలోకి వస్తే తాము మంచి చేస్తామని చెబితే బాగుంటుందని, కానీ బీఆర్ఎస్ నేతలు ఇలా బెదిరింపులకు దిగడం సరికాదని అంటున్నారు నెటిజన్లు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమదే అధికారం అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం ఇక్కడ మరో విశేషం.

సభకోసం రభస..
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రస్తుతం అనుకున్నంత క్రేజ్ రావడం లేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు పదే పదే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే పింక్ బుక్, కోబ్రా అంటూ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×