E-Paper
Advertisement

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా!

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా!
Advertisement

Municipal Elections: స్వేచ్ఛ బ్యూరోొ: దాదాపు రెండు నెలల నిరీక్షణకు తెర పడింది. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో మేజర్ స్థానాలు అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ బలోపేతం అయ్యినట్లు కనిపిస్తుంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి తక్కువ స్థానాలు ఉన్నాయో కో ఆప్షన్ మెంబెర్స్ సహాయంతో చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. ఇదే పద్దతిలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ దక్కించుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేసింది. చివరికి ఎన్నిక జరగకుండా వాయిదా వేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో శనివారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ పై చేయి సాధించింది.

కాంగ్రెస్ వాక్ఔట్..

చైర్మన్ ఎన్నిక ప్రారంభం అయ్యినా పదినిమిషాల్లో కాంగ్రెస్ వాక్ఔట్ చేసింది. పార్టీల బాలబలాలు స్పష్టం కావడంతో 8 మంది కాంగ్రెస్, బీజేపీ ఒకరు, ఆకుల యాదగిరి చొప్పున కౌన్సిల్లర్లు, ఎమ్మెల్యే లు చైర్మన్ పోటీకి అవసరమైన బలం లేకపోవడంతో సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ పట్నం పీఠం దక్కించుకోవాలనే ఎన్నో ఆశలతో ప్రయత్నం చేసి బంగపడ్డారు. ఎన్ని రోజుల సమయం ఇచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులును ఆకర్శించ లేకుండా పోయారు. దేంతో పట్నం ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పలుచన అయ్యినట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisement

Also read: నా గొంతు నొక్కేందుకే కుట్ర.. గాయపడ్డ సింహంలా రాఘవ్ చద్దా, రాజ్యసభ పదవి తొలగింపుపై ఓ రేంజ్‌లో ఫైర్

ఇచ్చిన మాట ప్రకారం వైస్ చైర్మన్..

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీజేపీ రెండు స్థానాలు గెలిచింది. అయినప్పటికీ బీజేపీ కి వైస్ చైర్మన్ ఇవ్వడం బీఆర్ఎస్ గొప్ప మనస్సు అని చెప్పాలి. ఎందుకంటె బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఉంటే ఒకరు కాంగ్రెస్కు, మరొకరు బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం గమనర్హం. అయినప్పటికీ బీఆర్ఎస్ ఒక్కరూ మద్దతు ఇచ్చిన వైస్ చైర్మన్ ఇవ్వడం మాట నిలబెట్టుకోవడం జరిగింది.

చైర్మన్, వైస్ చైర్మన్ వీళ్లే..

Advertisement

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ గా బీఆర్ఎస్ సభ్యులు టేకుల సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా బిజెపికి చెందిన ముత్యాల శ్యామలను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వీరి చేత ఎన్నిక పరిశీలకులు హాజరై ప్రమాణస్వీకారం చేయించారు. మున్సిపాలిటీ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్యలో నిర్వహించారు.

బాధ్యతలు స్వీకరించిన చైర్మన్..

చైర్మన్ గా ఎన్నికైన టేకుల సుదర్శన్ రెడ్డి వెంటనే బాధ్యతలు స్వీకరించారు. పట్నంలో బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీలు నిర్వహించి, టపాసులు కాల్చి విజయోత్సవాలు చేసుకున్నారు.

Also Read: రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×