BigTV English

KTR E-Formula Case : “లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమే..” – కేటీఆర్

KTR E-Formula Case : “లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమే..” – కేటీఆర్

KTR E-Formula Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ విచారణను ఎదుర్కున్నారు. దాదాపు 7 గంట‌ల పాటు విచారించిన ఈడీ పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలనే.. తాజాగా ఈడీ అడిగిందని కేటీఆర్ తెలిపారు.


ఫార్ములా ఈ కార్ రేస్ లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. నేడు ఈడీ విచారణను దాదాపు 7 గంటల పాటు ఎదుర్కున్న కేటీఆర్.. ఏసీబీ అధికారులు పలు విషయాలపై ప్రశ్నించినట్లు తెలిపారు. ఇక ఏసీబీ విచారణలో అడిగిన ప్రశ్నలనే.. తాజాగా ఈడీ అధికారులు తిప్పితిప్పి అడిగారని కేటీఆర్ వెల్లడించారు.

ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగిన అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ తప్పుడు కేసులు ఎదుర్కోవల్సి వస్తుందని తెలిపారు. లై డిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమని.. సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. తనకు కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉందని, న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను తప్పు చేయలేదని.. చేయబోనని… తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని కేటీఆర్‌ వెల్లడించారు.


ALSO READ : 7 గంటల సుదీర్ఘ విచారణ.. ఆ ప్రశ్నపై నోరు మెదపని కేటీఆర్

‘‘దర్యాప్తు సంస్థలు, విచారణ అధికారులపై ఉన్న గౌరవంతోనే ఈ విచారణకు హాజరయ్యా. నేను ఎలాంటి తప్పు చేయలేదు. గతంలో ఏసీబీ విచారణ ఇప్పుడు ఈడీ విచారణ ఒకే రకంగా ఉన్నాయి. రెండు సంస్థలు ఒకే రకమైన ప్రశ్నలు తిప్పి తిప్పి అడిగారు. అన్నింటికీ సరైన సమాధానమిచ్చా. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు సిద్ధమే.. ఎన్ని ప్రశ్నలు వేసినా మళ్లీ మళ్లీ సమాధానాలు చెబుతా. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థను ఎప్పటికీ గౌరవిస్తా. విచారణకు పూర్తిగా సహకరిస్తా…” అంటూ కేటీఅర్ తెలిపారు.

రేవంత్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై తప్పుడు కేసులు బనాయించారు. అయినప్పటికీ ఏ తప్పూ చేయకపోయినా దర్యాప్తు సంస్థలపై ఉన్న గౌరవంతో ఈ విచారణలుకు హాజరవుతున్నా.. నిజానికి నాకు ఒక విషయంలో చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇవాళ ఉదయం పేపర్‌లో ఒక వార్త వచ్చింది. ఫార్ములా ఈ-రేస్‌ కేసు విచారణకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఖర్చువుతుందని ఆ వార్త సారాంశం. అందుకే సీఎం రేవంత్‌రెడ్డికి నేను ఒక మాట చెబుతున్నా. మీపై ఏసీబీ, ఈడీ కేసులున్నాయని.. నాపైనా కేసులు పెట్టించారు. మీరు దొరికిపోయారు కానీ నేను నిజాయతీ గల వ్యక్తిని. కేసులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటా. విచారణ పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఇందుకు ఖర్చు పెట్టే డబ్బుతో ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు….

న్యాయమూర్తితో పాటు మీడియా ముందు లై డిటెక్టర్‌ పరీక్షకు నేను సిద్ధమే.. మరి సీఎం రేవంత్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నారా..? ఒకవేళ ఇలాంటి విచారణ జరిగితే రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగానే జరగాలి. ఇలా చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి. ప్రజాధనం కూడా వృథా కాకుండా ఉంటుంది. కక్ష సాధింపు చర్యలో భాగంగా విచారణ జరిపించటం సరైనది కాదు. త్వరలోనే నిజనిజాలు ప్రజలకు తెలుస్తాయి.  ఈ కేసులో మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు నాకు చెప్పలేదు. కానీ పిలిస్తే మాత్రం తప్పకుండా హాజరవుతా…’’ అని కేటీఆర్‌ తెలిపారు.

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×