Hyderabad News: అతి వేగం ప్రమాదకరం పదే పదే పోలీసులు చెబుతున్నారు. అయినా యువత ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది మత్యువాత పడుతున్నారు. తాజాగా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జేఎన్టీయూ వంతెనపై ఓ కారు బీభత్సం చేసింది.
హైదరాబాద్‌లో ఓ కారు బీభత్సం
ఉదయం దాదాపు 8 గంటల సమయంలో రైతుబజార్ దాటి వంతెన ఎక్కింది ఓ కారు. అందులోని వారు అతి వేగంతో కారుని డ్రైవింగ్ చేస్తూ వచ్చారు. తొలుత డివైడర్ ఢీ కొట్టారు. బ్యాలెన్స్ కాకపోవడంతో ఎదురుగా వస్తున్న టూ వీలర్‌ని ఢీ కొట్టింది. చివరకు ఆ కారు బోల్తా పడింది. అప్పడు గానీ ఆ కారు వేగం తగ్గలేదు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు యువకులు, ఓ అమ్మాయి ఉంది. వారంతా సూడాన్‌కి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వారంతా కారు దిగిపోయారు. అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని మెల్లగా జారుకున్నారు.
డివైడర్.. బైక్‌ని ఢీ కొట్టిన కారు
కారు నెంబరు ప్లేట్ ఆధారంగా వివరాలు సేకరంచే పనిలో పడ్డారు పోలీసులు. కారు బీభత్సం వెనుక అసలేం జరిగింది? కారుని యువకులు అద్దెకు తీసుకున్నారా? లేకుంటే ఎవరి దగ్గరైనా తీసుకుని రైడ్‌కి వచ్చారా? ఘటన సమయంలో వారు మద్యం తీసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: చేతబడి.. పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత ఆమె కూడా
కారు డ్రైవింగ్ చేసిన యువకులు నగరంలో చదువుతున్నట్లు తెలుస్తోంది. వారు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉన్నట్లు సమాచారం. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన గురించి మరింత సమాచారం అందాల్సి వుంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని చెక్ చేశారు పోలీసులు.
హైదరాబాద్ జేఎన్టీయూ వంతెనపై కారు బీభత్సం..
అతి వేగంతో డివైడర్, ఆ తర్వాత ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి బోల్తా పడిన కారు
ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు
యువకులు సుడాన్ దేశస్థులుగా గుర్తింపు pic.twitter.com/bEnXE7zInX
— BIG TV Breaking News (@bigtvtelugu) October 26, 2025