BigTV English

Ananthgiri Hills Car Racing : కార్ల రేసింగ్.. బైక్ స్టంట్స్.. అక్కడ వీకెండ్ లో రచ్చ రచ్చ..

Ananthgiri Hills Car Racing : కార్ల రేసింగ్.. బైక్ స్టంట్స్.. అక్కడ వీకెండ్ లో రచ్చ రచ్చ..
Ananthagiri hills car racing news

Ananthagiri hills car racing news(Latest news in telangana):

వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్‌ ఎంతో ఆహ్లాదకర ప్రాంతం. అలాంటి చోట ఆగస్టు 15న కార్ల రేసులు జరగడం కలకలం రేగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనంతగిరి వ్యూ పాయింట్ వద్ద ఈ రేసులు నిర్వహించారు. కొంతమంది యువకులు కార్లు, బైకులతో ప్రమాదకర విన్యాసాలు చేశారు. దీంతో వాహనాలు ఒక్కసారిగా దూసుకురావడంతో స్థానికులు, సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు.


వీకెండ్‌లో రెగ్యులర్‌గా ఇక్కడ రేసింగ్స్ జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. పోలీసులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగంలో చలనం రాకపోవడంతో కారు రేసులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు.

పంద్రాగస్టు హాలిడే కావడంతో భారీ సంఖ్యలో యువకులు అనంతగిరికి తరలి వచ్చారు. హారన్‌ మోగిస్తూ రేసులు పెట్టుకుని దుమ్ము రేపారు. డేంజరస్ స్టంట్‌లు చేశారు. యువకుల హంగామాను వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు ఖంగుతిన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా విచారణ మొదలుపెట్టారు.


అనంతగిరి హిల్స్ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వీకెండ్‌, ఫెస్టివల్
రోజుల్లో ఫ్యామిలీలు విహారయాత్రకు వస్తుంటాయి. అలాంటి ప్రాంతం ఇప్పుడు
రేసింగులకు అడ్డాగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అనంతగిరి ఏరియాలో
అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. గతంలోనే ఓ ఎస్‌ఐ, సిబ్బందితో ప్రత్యేక సంచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆగస్టు 15న వారు రాకపోవడంతో యువకులు చెలరేగిపోయారు. భవిష్యత్తులో ఇక్కడ రేసింగులు జరగకుండా పోలీసులు, అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని సందర్శకులు కోరుతున్నారు. యువకుల ఆగడాలను నియంత్రించాలని అంటున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×