BigTV English

BRS MLA : మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు.. ఎందుకంటే..?

BRS MLA : మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు.. ఎందుకంటే..?


BRS MLA : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూదందాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె ఆస్తుల విషయంలో పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కారు. తండ్రిపైనే ఫిర్యాదు చేశారు. తాజాగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

సామ ఇంద్రపాల్‌ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2018లో ఉప్పరపల్లిలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఇంద్రపాల్‌ రెడ్డి ప్రయత్నించారు. మధ్యవర్తులుగా ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, రాకేశ్‌ రెడ్డి ఉన్నారు. వారు శ్రీరామ్‌ రెడ్డి అనే వ్యక్తిని కూడా ఇంద్రపాల్ రెడ్డికి పరిచయం చేశారు. స్థలం, కమీషన్‌తో కలిపి రూ.3.65 కోట్లకు భూమి అమ్ముతామని చెప్పారు. వారికి కమీషన్‌ ఇచ్చేందుకు ఇంద్రపాల్‌ రెడ్డి కూడా అంగీకారం తెలిపారు.


2018 మే 24న ఇంద్రపాల్ రెడ్డి రూ.90 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత విడతల వారీగా మొత్తం రూ.3.05 కోట్లు ఇచ్చారు. ఇంకా 60 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. సెక్యూరిటీ కింద ఎమ్మెల్యే, రాకేశ్‌రెడ్డి.. ఇంద్రపాల్ వద్ద బ్లాంక్‌ చెక్కులు తీసుకున్నారు. అయితే ఇంద్రపాల్ మిగిలిన రూ.60 లక్షలు లోన్‌ రాగానే చెల్లిస్తానని చెప్పారు. ఈ సొమ్ము చెల్లించడానికి ఆలస్యం అవుతుందని నరేందర్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. గతేడాది జూన్‌లో ఇంటికి వచ్చి తన భార్యను బెదిరించారని, తనను గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని ఇంద్రపాల్ ఫిర్యాదులో వివరించారు.

ఎమ్మెల్ పట్నం నరేందర్ రెడ్డి తన గన్‌మెన్‌ను పంపించి చంపేందుకు ప్రయత్నించారని ఇంద్రపాల్ ఆరోపించారు. వారి నుంచి తప్పించుకొని‌ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. తాను తొలుత పోలీసులను ఆశ్రయించిన తర్వాత నుంచి రూ.2.5 కోట్లు ఇవ్వకపోతే చెక్‌ బౌన్స్‌ కేసు పెడతామని బెదిరించారని ఇంద్రపాల్‌ ఆరోపిస్తున్నారు.

తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే నేరుగా హైదరాబాద్‌ కమిషనర్‌కు వెళ్లానన్నారు. కేసును పశ్చిమ మండల డీసీపీకి రిఫర్‌ చేశారని బాధితుడు తెలిపారు. అయినా సరే డీసీపీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కోర్టును ఆశ్రయించానని వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రాకేశ్‌ రెడ్డిపై పలు సెక్షన్లపై కేసు నమోదయ్యాయి. ఈ వ్యవహారం ఫిల్మ్‌నగర్‌ లో ఉండటంతో అక్కడి పోలీస్‌ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.

Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×