BigTV English

Sourdough Bread : బ్రెడ్‌తో మంచి నిద్ర సాధ్యం.. కొత్త రెసిపీతో..

Sourdough Bread : బ్రెడ్‌తో మంచి నిద్ర సాధ్యం.. కొత్త రెసిపీతో..

Sourdough Bread : మనిషి బ్రతకడానికి బ్రెడ్ ఉంటే చాలు.. అనే సామెత ఉండేది. అందుకేనేమో ఇప్పటికీ చాలామంది ఫారిన్ దేశాల్లో బ్రెడ్‌తోనే వారి రోజును ప్రారంభిస్తారు. ఎంత కష్టపడినా బ్రెడ్ కోసమే కదా అంటారు. అయితే ఈ బ్రెడ్ వల్ల మనకు తెలియని మరెన్నో లాభాలు ఉంటాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ బ్రెడ్ ధర కేవలం 15 యూరోలే అయినా.. దీని వల్ల మనిషి శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా ఆరోగ్యం లభిస్తుందని తాజాగా వారి పరిశోధనల్లో తేలింది.


పలు బ్రెడ్‌లు పులిసిపోయిన పిండితో తయారు చేస్తారు. ఈ పిండితో ఎవరి బ్రెడ్‌ను వారే తయారు చేయగలుగుతారు కదా. కానీ సరైన పదార్థాలను సమపాళ్లలో కలిపితే.. ఈ బ్రెడ్ అనేది మంచి నిద్రకు, కరెక్ట్ బీపీకి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు మనుషుల ఆరోగ్యాలను మెరుగుపరిచే బ్రెడ్‌ను తయారు చేసి చూశారు కూడా. ఈ బ్రెడ్ ముక్కలు రోజుకు రెండు తింటే చాలు.. ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుందని, ఉత్సాహంగా అనిపిస్తుందని బయటపెట్టారు.

ఈ పిండి అనేది మనం తినే ఇతర ఆహార పదార్థాలను కూడా జీర్ణించుకోవడం ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్‌ను మెరుగుపరచడం, టైప్ 2 డయాబెటీస్‌ను దూరం చేయడం.. ఇలా మరెన్నో చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కేవలం బ్రెడ్ మాత్రమే కాదు.. ఈ పిండితో చేసిన మరెన్నో పదార్థాలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేలా తయారు చేసుకోవచ్చని వారు అన్నారు. ప్రస్తుతం ఈ పిండితో ఆరోగ్యకరమైన ‘మఫిన్స్‌’ను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.


శాస్త్రవేత్తలు కొత్తగా తయారు చేస్తున్న మఫిన్స్ అనేది ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్‌తో నిండేలా వారు జాగ్రత్తపడుతున్నారు. అంటే ఎక్కువగా ఫైబర్‌తో తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇలాంటివి మనుషుల ఆరోగ్యాలను మెరుగుపరచాలి అంటే ఇందులో ప్రోబయాటిక్స్‌ను యాడ్ చేయాలని వారు బయటపెట్టారు. ప్రోబయాటిక్స్ అంటే మామూలుగా గుడ్ బ్యాక్టీరియా అని అంటుంటారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని అన్నారు. ఈ హెల్తీ మఫిన్స్ తయారీ సక్సెస్‌ఫుల్ అయితే త్వరలోనే దీని రెసిపీని బయటపెడతామని హామీ ఇచ్చారు శాస్త్రవేత్తలు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×