E-Paper
Advertisement

నాగారం గ్రామంలో కుల బహిష్కరణ ఆరోపణలు కలకలం

నాగారం గ్రామంలో కుల బహిష్కరణ ఆరోపణలు కలకలం
Advertisement

Caste Boycott: స్వేచ్ఛ బ్యూరో: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో కుల బహిష్కరణ ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గ్రామానికి చెందిన ఆకుల బాలయ్య కుటుంబం తమను కుల బహిష్కరణకు గురిచేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని అధికారులను కోరుతుండగా, మరోవైపు అదే గ్రామానికి చెందిన కొమురయ్య, రాజయ్య తదితర ముదిరాజ్ కులస్తులు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. ఆకుల బాలయ్య మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా చేపల చెరువు వ్యవహారంలో గ్రామంలోని కొందరితో విభేదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గతంలో నమోదైన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్నప్పటికీ, తమ కుటుంబాన్ని సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారని ఆరోపించారు.

కుటుంబానికి ప్రాణహాని..

గ్రామంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, అంత్యక్రియలకు తమ కుటుంబ సభ్యులు రావద్దని హెచ్చరిస్తున్నారని, దీంతో తాము సామాజికంగా ఒంటరితనానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించినప్పటికీ పూర్తి న్యాయం జరగలేదని విలేకరుల ముందు వాపోయారు. అయితే ఈ ఆరోపణలను నాగారం గ్రామానికి చెందిన కొమురయ్య, రాజయ్య తదితరులు ఖండించారు. అసలు సమస్య కుల బహిష్కరణ కాదని, నాగారం–ఉమ్మాపూర్ గ్రామాల మధ్య గండి చెరువు మత్స్యకార హక్కుల వివాదమే కారణమని పేర్కొన్నారు. సుమారు 30 సంవత్సరాల క్రితం నాగారం, ఉమ్మాపూర్ గ్రామస్తులు అంతా కలిసే ఉండే వారమని, అనంతరం రెండు గ్రామాలుగా విడిపోయిన తర్వాత చెరువులో చేపల వేట హక్కుల విషయంలో విభేదాలు తలెత్తాయని వివరించారు.

Advertisement

Also read: ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

రాజయ్య మాట్లాడుతూ..

మత్స్యకార సంఘంలో రెండు గ్రామాలకు చెందిన కొందరికి మాత్రమే సభ్యత్వం ఉండగా, బాలయ్య ఉమ్మాపూర్ గ్రామానికి చెందిన సభ్యులకు మద్దతు ఇస్తున్నారని, ఆ కారణంగా వివాదాలు మరింత పెరిగాయని ఆరోపించారు. తమ పై కుల బహిష్కరణ చేశామంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారని వాపోయారు. రాజయ్య మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా రెండు గ్రామాల ముదిరాజ్ కులస్తులు కలిసి మెలిసి ఉన్నారని, ఆలయ నిర్మాణం వంటి కార్యక్రమాలను కూడా కలిసి నిర్వహించామని చెప్పారు. గ్రామ పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, బాలయ్య సహకరించడం లేదని ఆరోపించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో, అధికారులు గ్రామంలో సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుల బహిష్కరణ ఆరోపణలు నిజమా..? లేక చెరువు హక్కుల వివాదం వల్ల ఏర్పడిన విభేదాలేనా..? అనే అంశాలపై అధికారుల విచారణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: పెద్దపల్లికి గుడ్‌న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త బస్ డిపో!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×