E-Paper
Advertisement

పెద్దపల్లికి గుడ్‌న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త బస్ డిపో!

పెద్దపల్లికి గుడ్‌న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి సరికొత్త బస్ డిపో!
Advertisement

Peddapalli Bus Depot: పెద్దపల్లి జిల్లాలో రవాణా సౌకర్యాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ డిపో నిర్మాణ పనులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు.

డిపో పనుల పురోగతిని సమీక్షిస్తూ.. నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సహచర మంత్రి శ్రీధర్ బాబు అందించిన వివరాల మేరకు పనులు త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి బస్ డిపో నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో జిల్లా అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.

Advertisement

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కోట్ల రూపాయల బస్సు ఛార్జీలను భరించి ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

Also Read: “నీ ఏడుపే బీజేపీకి శాపం” అంటూ ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు కలకలం

Advertisement

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×