BigTV English
Advertisement

Akhil Akkineni: అఖిల్ మూవీలో విలన్ ఫిక్స్.! ఏకంగా బాలీవుడ్ యాక్టర్‌ను దింపుతున్న మేకర్స్..

Akhil Akkineni: అఖిల్ మూవీలో విలన్ ఫిక్స్.! ఏకంగా బాలీవుడ్ యాక్టర్‌ను దింపుతున్న మేకర్స్..

Akhil Akkineni: ఈరోజుల్లో సౌత్, నార్త్ అని తేడా ఏమీ లేదు. ఏ నటుడు అయినా ఏ భాషలో అయినా నటించడానికి వెనకాడడం లేదు. ముఖ్యంగా సౌత్ సినిమాల్లో నటిస్తే రీచ్ బాగా పెరుగుతుందనే ఆలోచన బాలీవుడ్ యాక్టర్లలో కూడా మొదలయ్యింది. అందుకే గత కొన్నేళ్లలో ఎంతోంది బాలీవుడ్ నటీనటులు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. చాలామంది బీ టౌన్ యాక్టర్లు తెలుగు సినిమాల్లో విలన్స్‌గా కూడా కనిపించారు. అలా కనిపించి మెప్పించిన వారి లిస్ట్‌లోకి మరో యాక్టర్ యాడ్ అవ్వనున్నాడు. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) అప్‌కమింగ్ మూవీలో విలన్‌గా ఏకంగా ఒక బాలీవుడ్ యాక్టర్‌నే రంగంలోకి దించుతున్నారట మేకర్స్. తాజాగా బయటికొచ్చిన ఈ అప్డేట్ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసింది.


అఖిల్ పట్టుదల

అక్కినేని వారసుడిగా హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించాడు అఖిల్. తన అన్నయ్య నాగచైతన్యలాగానే అఖిల్‌కు కూడా మొదట్లో అంతగా హిట్స్ రాలేదు. దీంతో మెల్లగా తనే ఫామ్‌లోకి వస్తాడులే అని అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అఖిల్ ఇప్పటివరకు హీరోగా అయిదు సినిమాల్లో నటించగా.. ఆ అయిదు కూడా ఫ్లాప్ లేదా డిశాస్టర్లుగానే నిలిచాయి. ఇప్పుడు తన కెరీర్‌లో 6వ సినిమాతో అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే హిట్ కొట్టేవరకు ప్రేక్షకుల ముందుకు రానంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా తన కెరీర్‌లోని 6వ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.


Also Read: అప్పుడే మొదలు.. చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్..

బాలీవుడ్ యాక్టర్

అఖిల్.. ప్రస్తుతం మురళీ కృష్ణ అబ్బూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయినా కూడా ఇది ప్రేక్షకులకు తెలియకుండా సైలెంట్‌గా మ్యానేజ్ చేస్తున్నారు మేకర్స్. అఖిల్ కూడా ఈ మూవీ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టాడు. తాజాగా ఈ సినిమాలో విలన్ ఎవరు అనేదానిపై సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ‘1992 స్కామ్’ వెబ్ సిరీస్ ఫేమ్ ప్రతీక్ గాంధీ.. అఖిల్‌కు ధీటైన విలన్ పాత్రలో నటించనున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అఖిల్ పాత్రతో పాటు విలన్ పాత్రను కూడా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట డైరెక్టర్. దానికి ప్రతీక్ గాంధీ అయితే సరిగ్గా సరిపోతాడని మేకర్స్ ఫీలవుతున్నారని సమాచారం.

ఎవరీ నటుడు.?

ప్రతీక్ గాంధీ (Pratik Gandhi) ఒక గుజరాతీ నటుడు. కానీ ‘1992 స్కామ్’ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఆ వెబ్ సిరీస్ ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలా తను బీ టౌన్‌లో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. తనకు మెల్లగా హిందీలో కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది. ఒకవైపు గుజరాతీ సినిమాల్లో నటిస్తూనే హిందీ ఆఫర్లను కూడా ఒప్పుకుంటూ బిజీ అయిపోయాడు ప్రతీక్ గాంధీ. మరి అలాంటి నటుడు ఈ తెలుగు విలన్ ఆఫర్‌ను ఒప్పుకుంటాడా అని ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం తెరపై చూడడానికి డిఫరెంట్‌గా ఉంటుందని ఫీలవుతున్నారు.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×