Tiger Conservation: స్వేచ్ఛ బ్యూరో: పులుల సంరక్షణపై పర్యాటకం మానవ కార్యకలాపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఆడపులుల సంతానోత్పత్తికి అవసరమైన ప్రశాంతమైన వాతావరణం క్రమంగా కరువవుతోందని ఈ పరిశోధనలో తేలింది. సీఎస్ఐఆర్- సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డా. జి. ఉమాపతి నేతృత్వంలోని బృందం 2020 నుంచి 2023 వరకు ఐదు ప్రధాన పులి అభయారణ్యాల్లో ఈ సమగ్ర పరిశోధన నిర్వహించింది. కార్బెట్. తడోబా-అంధారి, కాన్హా, బంధమ్గఢ్ పెరియార్ పులి అభయారణ్యాల్లో శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. మొత్తం 610 పులుల విసర్జన నమూనాలను విశ్లేషించారు. ఇందులో 291 ఆడపులులు, 185 మగపులుల నమూCCMB Study, Tiger Reserves India, Wildlife Tourism, Tiger Reproduction, Tiger Stress Hormonesనాలపై సమగ్రంగా స్టడీ నిర్వహించి కీలక విషయాలను గుర్తించారు.
నాన్-ఇన్వేసివ్ పద్ధతిలో విసర్జన నమూనాల ద్వారా రెండు ముఖ్యమైన హార్మోన్లను కొలిచారు. ఇందులో ఒకటి ఫీకల్ గ్లూకోకార్టికోయిడ్ మెటాబోలైట్స్. ఇది పులులలోని ఒత్తిడి స్థాయిని సూచిస్తుంది. మరొకటి ఫీకల్ ప్రొజెస్టెరోన్ మెటాబోలైట్స్. ఇది ఆడపులుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ హార్మోన్ల అంచనాల తీరు ఆధారంగా పులులకు సంతాన ఉత్పత్తి ముప్పు కలుగుతుందని సైంటిస్టులు పరిశోధనల్లో నిర్ధారించారు. మరో వైపు ఈ అధ్యయనం పులుల ప్రవర్తన, ఆరోగ్యంపై పర్యాటక ప్రభావం గురించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది.
ఆశ్చర్యకరంగా, కఠిన రక్షణ ఉండే కోర్ జోన్లలోని పులులు పర్యాటకుల రాకతో అధిక ఒత్తిడికి గురవుతున్నాయి. బఫర్ జోన్లలో ఉండే పులులు నిత్యం మానవ ఉనికికి అలవాటు పడగా, కోర్ జోన్ పులులు సీజనల్ పర్యాటకం ప్రారంభం కాగానే తీవ్ర ఒత్తిడిని ప్రదర్శించాయి. అంతేగాక పర్యాటక వాహనాలు తిరిగే రహదారుల సమీపంలో సంచరించే పులుల్లో ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా తడోబా, బంధమ్గఢ్ అభయారణ్యాల్లో స్పష్టంగా కనిపించింది.
Also Read: POCSO Case: తెలంగాణలో సంచలనం.. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. ఎందుకంటే?
ఆడపులులు పిల్లలను కనడానికి అత్యంత ప్రశాంతమైన ప్రాంతాలను ఎంచుకుంటాయి. అయితే, కోర్ ప్రాంతాలు కూడా పర్యాటక ఒత్తిడికి
లోనవుతుండటంతో, సంతానోత్పత్తి విజయవంతం కావడం తగ్గుతోంది. ఒత్తిడిలో పుట్టిన పిల్లల ఎదుగుదల కూడా సాధారణ పులి పిల్లల కంటే భిన్నంగా ఉంటోందని డా. ఉమాపతి తెలిపారు. వన్యప్రాణి పర్యాటకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమే అయినప్పటికీ, పులుల మనుగడ కోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సీసీఎంబీ డైరెక్టర్ డా. వినయ్ నందికూరి, డా. ఉమాపతి సూచించారు.
సఫారీ వాహనాల సంఖ్యను కఠినంగా తగ్గించాలి. వాహనాల రద్దీ లేకుండా చూడాలి. ఉదయం, సాయంత్రం సఫారీ సమయాలను కనీసం ఒక గంట మేర తగ్గించాలి. పర్యాటక మార్గాలకు దూరంగా పులుల కోసం అదనపు నీటి వనరులను ఏర్పాటు చేయాలి. ఆడపులుల సంతానోత్పత్తి ‘హాట్‌స్పాట్‌లను’ గుర్తించి, నాన్-ఇన్వేసివ్ పద్ధతుల ద్వారా వాటిని నిరంతరం పర్యవేక్షించాలి. పులుల సంరక్షణ కేవలం వాటి సంఖ్యను పెంచడమే కాకుండా, వాటి మానసిక ఆరోగ్యం ప్రశాంతమైన ఆవాసాన్ని కాపాడటంలో కూడా ఉందని ఈ నివేదిక గుర్తు చేస్తోంది.
Also read: తెలంగాణకు హరితహరం అంతా తుస్సేనా.. పాత హరిత ఫైళ్లు ఓపెన్‌తో జంకుతున్న గత పాలకులు..?