Tragedy in Kamareddy: అసలే ఎండాకాలం.. ఇంటా బయటా ఒకటే వేడి. దాన్ని నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. నిద్ర పట్టలేక వేడి గాలి ఉండడంతో చాలామంది కూలర్లను ఆశ్రయిస్తున్నారు. తాజాగా చల్ల గాలి కోసం పెట్టుకున్న కూలర్, ఇద్దరి ప్రాణాలను బలికొంది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
జుక్కల్ పోలీసుల వివరాల మేరకు.. ఓ తండాకు చెందిన ప్రహ్లాద్-శాంకబాయి దంపతులకు ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు హైదరాబాద్‌లో చదువుతోంది. మిగతా ఇద్దరు పిల్లలు తండాలో పేరెంట్స్ దగ్గర ఉంచి చదువు కుంటున్నారు. రెండు రోజుల కిందట ప్రహ్లాద్ హైదరాబాద్ వెళ్లాడు. దీంతో ఇద్దరు పిల్లలతో శాంకబాయి ఇంట్లో ఉంది.
అసలేం జరిగింది?
రాత్రి వేళ విపరీతంగా ఉక్కపోస్తుండడంతో కూలర్ ఆన్ చేసి నిద్రపోయారు.అయితే కూలర్ పక్కనే శాంకబాయి చిన్న కూతురు శ్రీవాణి నిద్రపోయాడు. నిద్రలో ఎవరి కాలు కూలర్‌కి తగిలిందో తెలీదు. వెంటనే శ్రీవాణికి షాక్ తగిలింది. కూతురు పక్కనే నిద్రపోతున్న శాంకబాయికి ఆ షాక్ తగిలి ఇద్దరు స్పాట్‌లో మృతి చెందారు.
తల్లి, అక్కకు దూరంగా నిద్రపోయాడు కొడుకు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి తల్లి-అక్క ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి విషయం చెప్పాడు. వారు వచ్చేసరికి శాంకబాయి, ఆమె కూతురు శ్రీవాణి చనిపోయి ఉన్నారు. తండావాసుల సమాచారంతో పోలీసులు శాంకబాయి ఇంటికి చేరుకున్నారు.
ALSO READ: ప్రాణం తీసిన ప్రేమ, డెలివరీ బాయ్‌ని హత్య చేయించిన ప్రియురాలు
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. విద్యుద్ షాక్‌కు కారణమైన కూలర్ స్థానికంగా తయారు చేసినట్టు తేలింది. ఇనుప కూలర్ కావడంతో తీవ్రత ఎక్కువగా ఉందని అంటున్నారు. కొన్నాళ్లుగా ఆ తండాలో పలు ఇళ్లకు విద్యుత్ షాక్ ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈ క్రమంలో శంకబాయి ఘటన జరిగిందని అంటున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.