E-Paper
Advertisement

శాంతి భద్రతలపై అలసత్వం.. పోలీసుశాఖలో అవినీతి ఏమాత్రం సహించను-సీఎం రేవంత్‌రెడ్డి

శాంతి భద్రతలపై అలసత్వం.. పోలీసుశాఖలో అవినీతి ఏమాత్రం సహించను-సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Hyderabad: టెక్నాలజీ అనుగుణంగా కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, అందుకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. శాంతి భద్రతలపై ఏ మాత్రం అలసత్వం వహించినా  సహించేది లేదని తేల్చిచెప్పేశారు. పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ కీలక సమావేశం

Advertisement

బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ‌లో పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. డీజీపీ సీవీ ఆనంద్‌తోపాటు పోలీసు కమిషనర్లు, ఐజీ ర్యాంక్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భద్రతా సలహాదారులు ఇందులో పాల్గొన్నారు. శాంతి భద్రతల విషయంలో అలసత్వాన్ని ఏ మాత్రం సహించబోమన్నారు.

ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇకపై క్రైమ్ రివ్యూలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఎస్పీలు జిల్లా పర్యటనలు చేపట్టాలని, జిల్లాల్లో ఏం జరుగుతుందో ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. అన్ని పోలీసు స్టేషన్లలో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.

Advertisement

కల్తీ కారణంగా క్యాన్సర్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఆహార కల్తీపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించి నిబంధనలను కఠినతరం చేయాలని ఆదేశించారు.డ్రగ్స్-గంజాయిపై కఠిన చర్యలు కొనసాగించాలని, డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

పోలీసుశాఖలో అవినీతి ఏమాత్రం సహించను-సీఎం రేవంత్‌రెడ్డి

సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. దీనికితోడు సీసీ కెమెరాల వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, సెలబ్రిటీలు, వీఐపీల కార్యక్రమాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆలోచనలను పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రి.

పోలీసు శాఖలో ప్రతి ఒక్క అధికారి వ్యవస్థకు లోబడి పని చేయాలని, వ్యవస్థకు మించి వ్యవహరిస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూనే, అందులో పనిచేసే సిబ్బందిని ట్రైనింగ్ దశలో ఎంపిక చేసుకోవాలని సూచించారు. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్‌పై పోలీసు విభాగం కోసం కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వాలన్నారు.

మెరిట్ ఆధారంగా పోస్టింగులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐ నుంచి నాన్ కేడర్ ఎస్పీ ర్యాంక్ అధికారి వరకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు ఇతర విభాగాల్లో పని చేసేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం మెరుగుపడాలని, జిల్లా హెడ్‌క్వార్టర్ దాటితే తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని తేల్చి చెప్పేశారు.

ALSO READ: అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.. జనగామ జిల్లా అభివృద్ధి పనులకు ఎంపీ చామల శంకుస్థాపన!

మరొక విషయాన్ని ప్రస్తావించారు. విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా, జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ శాఖ-హైడ్రాతో సమన్వయం చేసుకుని ఫైర్ డిపార్ట్మెంట్‌పై జూన్ 15లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు.

మ్యాన్‌హోల్స్ నిర్వహణపై ట్రాఫిక్ పోలీసులు-హైడ్రా-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. సిటీలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫ్లెక్సీలను నియంత్రించాల్సిందేనన్నారు. పోలీసు కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

పోలీసు శాఖలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, నైట్ పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలన్నారు. రౌడీ షీట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని, కాలం చెల్లిన ఆయుధాలను పక్కన పెట్టి ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలన్నారు. డ్రోన్ పోలీసింగ్‌కు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×