South Central Railway Trains Cancele: ప్రయాణీకులు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా 30 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా రైళ్లను వేర్వేరు రోజుల్లో రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కాజీపేట- డోర్నకల్, డోర్నకల్- విజయవాడ, భద్రాచలం రోడ్డు- విజయవాడ ప్యాసింజర్ రైళ్లను 11 రోజుల పాటు రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని సిర్పూరు కాగజ్‌నగర్, రెబ్బెన, బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్ల గుండా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు క్యాన్సిల్ చేశారు. ఈ రైళ్లు ఇవాళ్టి నుంచి (ఫిబ్రవరి 10) ఈ నెల 20 వరకు ఈ మార్గంలోని నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అటు గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు వారం నుంచి 11 రోజుల పాటు ప్రయాణీకులకు అందుబాటులో ఉండవని ప్రకటించింది. మరో 9 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్లు తెలిపింది.
పూర్తిగా క్యాన్సిల్ అయిన రైళ్లు ఇవే!
⦿ సికింద్రాబాద్- గుంటూరు మధ్యన నడిచే గోల్కొండ ఎక్స్ ప్రెస్(17201/17202) ను ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు క్యాన్సిల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
⦿ సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్యన నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్(17233/17234) ను ఫిబ్రవరి 10 నుంచి 21 వరకు రద్దు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
⦿ గుంటూరు- సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ (12705/12706) ను ఈ నెల 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో క్యాన్సిల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
⦿ విజయవాడ- సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ ప్రెస్(12713/12714) రైలును ఈ నెల 11, 14, 16, 18, 19, 20 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Read Also: ఒకేసారి పట్టాలెక్కనున్న 9 వందేభారత్ స్లీపర్ రైళ్లు, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!
ఆలస్యంగా నడిచే రైళ్లు ఇవే!
⦿ సికింద్రాబాద్- విశాఖపట్నం (20834) వందేభారత్ ఎక్స్ ప్రెస్: 19, 20 తేదీల్లో 75 నిమిషాలు లేటుగా నడవనుంది.
⦿ ఆదిలాబాద్-తిరుపతి (17406) కృష్ణా ఎక్స్ ప్రెస్: 9, 11, 14, 18, 19 తేదీల్లో 90 నిమిషాల పాటు ఆలస్యంగా నడవనుంది.
అటు తాజాగా విజయవాడ డివిజన్ పరిధిలోని నూజివీడు- వట్లూరు- ఏలూరు మధ్య ఆటోమేటిక్ సెక్షన్ ప్రారంభించేందుకు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు నిర్వహించారు. ఈ పనుల కారణంగా ఈ నెల 8న 6 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. 7, 8 తేదీల్లో 13 రైళ్లను దారి మళ్లించింది దక్షిణ మధ్య రైల్వే.
ఈ ఏడాది 9 వందే భారత్ స్లీపర్ రైళ్లు రెడీ
ఇక అత్యాధునిక వందే భారత్ రైళ్లను మరిన్నింటిని రెడీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది తొమ్మిది వందే భారత్ ట్రైన్ సెట్స్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్, డిసెంబర్ మధ్య ఐసీఎఫ్ ఈ రైళ్లను డెలివరీ చేయనున్నది. ఈ రైళ్లలో మూడు కేటగిరిలు ఉంటాయి. ఏపీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ, ఏసీ త్రీ టైర్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. గత నెలలో భారతీయ రైల్వేశాఖ 24 వందే భారత్ స్లీపర్ రైలు 50 రేక్ ల కోసం ఆర్డర్ ఇచ్చింది. రాబోయే రెండేళ్లలో ఇవి రెడీ అయ్యే అవకాశం ఉంది. 2026-27 సంవత్సరంలో 24 ట్రైన్ సెట్స్ ఉత్పత్తి కాబోతున్నాయి. వందేభారత్ స్లీపర్ రైళ్లు భారతీయ రైల్వేను మరింత అత్యాధునికంగా మార్చనున్నాయి.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు, ఎన్ని కిలో మీటర్లు ఉంటుందో తెలుసా?