BigTV English

China Virus In Hyderabad: అలర్ట్ .. హైదరాబాద్‌లో 11 హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు

China Virus In Hyderabad: అలర్ట్ .. హైదరాబాద్‌లో 11 హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు

China Virus In Hyderabad: దేశంలో HMPV వైరస్ కలకలం రేపుతోంది. దేశంలో ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయి. బెంగళూర్‌లో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకగా.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒకరికి వైరస్ సోకింది. అదే విధంగా తమిళనాడులో ఒకటి, కోల్ కతాలో ఒకటి కేసులు నమోదయ్యాయి.


తాజాగా హైదరాబాద్‌లో 11 HMPV వైరస్ కేసులు నమోదు అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అవును ఈ విషయాన్ని ఓ ప్రైవేటు ల్యాబ్ వెల్లడించింది. 258 మందికి శ్వాశకోశ వైద్య పరీక్షలు చేయగా 11 మందికి HMPV వైరస్ సోకినట్లు.. వైద్యులు నిర్ధారించారు.

డిసెంబర్ నెలలో..
గతేడాది డిసెంబర్ నెలలో కొంతమంది వైరల్ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతూ.. మణి మైక్రోబయాలజీ ల్యాబరేటరీకి వచ్చారు. అక్కడ 258 శ్వాశకోశ వైద్య పరీక్షలు నిర్వహించాగా అందులో 11 మందికి హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ సోకినట్లు నిర్దారించారు. వారు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ వైరస్ కొత్తదేమి కాదని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపింది.


అయితే ఈ HMPV వైరస్ బారినపడిన బాధితులతో.. చైనాలో ఇప్పటికే హాస్పిటళ్లు నిండిపోయాయి. స్మశానాల్లో స్థలం ఖాళీ లేదు.. ఇలా అనేక వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో చాలా మంది ప్రజలు పానిక్‌ మోడ్‌లోకి వచ్చేశారు కూడా. కానీ ఈ హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్‌కు సంబంధించిన నిజాలేంటి? చైనాలో నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయా? అక్కడి ప్రజలు వణికిపోతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు చైనాలో ఉండే ఓ తెలుగు వ్లాగర్. అక్కడి పరిస్థితులు ఏంటో చూద్దాం.

అక్కడ వైరస్ ఉన్నది నిజమే. కానీ ఇది ప్రస్తుతం అనుకుంటున్నంత డేంజర్ కాదు.. ప్రాణాంతకం అసలే కాదు. ఈ విషయాన్ని ఆ వ్లాగర్‌తో పాటు.. అనేక మంది అసలైన వైద్య నిపుణులు చెబుతున్న విషయం. ఇప్పటికే ఇండియాలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్న విషయం నిజమే. కానీ అవేవీ కూడా ప్రాణాంతకం అనేది కూడా అంతే నిజం అంటున్నారు వైద్య నిపుణుు.

హ్యుమన్ మెటానిమో వైరస్.. సింపుల్‌గా HMPV.. సాధారణ ఇన్‌ఫెక్షన్ వల్ల సోకుతుంది ఈ వైరస్. దీని వల్ల దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ వైరస్ అస్సలు కొత్తది కాదంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి వింటర్ సీజన్‌లో వచ్చే జబ్బుల్లో ఐదు నుంచి 10 శాతం ఈ వైరస్‌ కారణమవుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఇది RNA వైరస్ అని.. ఇది మ్యూటేట్ అవుతూ వేగంగా విస్తరిస్తుందని చెబుతున్నారు. అయితే దీని కారణంగా భయపడటం అనవసరమని ధీమాగా చెబుతున్నారు. అంతేకాదు దీనికి, కోవిడ్ -19కి అస్సలు పోలిక లేదని చెబుతున్నారు.

Also Read: వణుకుపుట్టిస్తున్న HMPV.. కరోనా కంటే డేంజరా ? లక్షణాలివే !

పాత వైరసే కదా.. మరి దీనికి వ్యాక్సిన్ ఎందుకు లేదన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ వాడాల్సినంత ప్రమాదకర వైరస్ కాదు కాబట్టి.. అసలు దీనికి వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. మాములుగా జలుబు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

కేంద్రం కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. ఈ వైరస్ అంత ప్రమాదకరం కాదని.. ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురికావొద్దని చెబుతోంది. అయితే ముందుస్తు జాగ్రత్తలు మాత్రం తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

HMPV కేసులు పెరిగితే లాక్‌డౌన్‌ విధించే చాన్స్ ఉందా? అంటే లేదనే చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే కోవిడ్ వైరస్‌ లాగా దీనికి ఎక్కువ ఇంక్యూబేషన్‌ టైమ్ లేదని.. కాబట్టి.. ఎక్కువ కంగారు అవసరం లేదంటున్నారు. అంతేకాదు దీనికి ప్రత్యేకంగా మెడికేషన్ అవసరం లేదంటున్నారు. జ్వరం ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందంటున్నారు కొందరు వైద్య నిపుణులు. న్యూమోనియా వస్తే మాత్రమే హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్ తీసుకుంటే సరిపోతుందంటున్నారు. హెచ్‌ఎంపీవీ వైరస్ భారత్ లో ఎప్పటి నుంచే ఉందని ICMR కూడా వెల్లడించినట్లు వివరించింది.

దెయ్యం కంటే.. భయం మహా చెడ్డది అంటారు. ప్రస్తుతం HMPV వైరస్‌ సిట్యూవేషన్‌కు ఇది పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. ఇప్పటికైనా అనవసరమైన చెత్తను మీ మైండ్‌లోకి ఎక్కించుకోకుండా.. ప్రశాంతంగా ఉండండి. అలాగని వింటర్‌లో వచ్చే సాధారణ సమస్యలను అస్సలు నెగ్లేట్ చేయకండి.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×