BigTV English

Chalapathirao : చలపతిరావుకు చిరు, బాలయ్య నివాళులు.. ఎన్టీఆర్‌ భావోద్వేగం..

Chalapathirao : చలపతిరావుకు చిరు, బాలయ్య నివాళులు.. ఎన్టీఆర్‌ భావోద్వేగం..

Chalapathirao : ప్రముఖ నటుడు చలపతిరావుకు సినీప్రముఖులు నివాళు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం టాలీవుడ్ కు తీరని లోటన్నారు.


చిరంజీవి
రవిబాబు నివాసానికి వెళ్లి చలపతిరావు పార్థివదేహానికి చిరంజీవి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ డిసెంబర్ తీరని వేదన కలిగించిందని మెగాస్టార్ అన్నారు. విలక్షణమైన నటుడు, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావు అకాల మరణ వార్తను తనను కలచివేసిందన్నారు. మద్రాసులో ఉన్నప్పటి నుంచే ఆయనతో అనుబంధం ఉందని తెలిపారు. ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేశారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు. రవిబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నటుడు చలపతిరావు తనకు మంచి మిత్రుడని అన్నారు.

బాలకృష్ణ
చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని బాలకృష్ణ అన్నారు. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారని ప్రశంసించారు. నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించారని గుర్తు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చలపతిరావుకు తమ కుటుంబంతో ఆత్మీయబంధం ఉందన్నారు. నాన్నగారితో కలసి ఎన్నో చిత్రాల్లో నటించారని గుర్తు చేశారు. తన చిత్రాల్లోనూ చలపతిరావు మంచి పాత్రలు పోషించారని బాలయ్య చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


ఎన్టీఆర్
చలపతిరావు అకాల మరణం తనను ఎంతగానో కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి కుటుంబం ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందన్నారు. తాత రోజుల నుంచి తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన ఆయన మృతి మా అందరికీ తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ వీడియో కాల్‌లో స్పందించారు. మీరు మరణించారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా ‘లే బాబాయ్‌..లే’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు. ఆది సినిమాలో ఎన్టీఆర్‌, చలపతిరావు కలిసి నటించారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×