CM Revanth Reddy: హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం వెంటనే రాష్ట్ర డీజీపీ కి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై పలువురు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో అల్లు అర్జున్ ఇంటి వద్ద గల మొక్కల కుండీలను పలువురు ధ్వంసం చేశారు. ఈ విషయంపై అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ సైతం స్పందించి.. ఇటువంటి దాడులకు పాల్పడడం తగదని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ప్రశాంతత వాతావరణం కలిగేలా ప్రవర్తించాలని సూచించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ సైతం ఓ ట్వీట్ చేశారు. తన అభిమానుల పేరిట సోషల్ మీడియాలో రెచ్చగొట్టే రీతిలో ఎవరైనా కామెంట్స్ చేస్తే, వారిపై ఫిర్యాదు చేసేందుకు వెనకాడనని బన్నీ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడంతో, దాడిని ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ కి సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా దాడి జరిగిన విషయంలో ఎటువంటి అలసత్వం సహించేది లేదని సీఎం అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధంలేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సీఎం సూచించారు.
సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు.
సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు…
— Revanth Reddy (@revanth_anumula) December 22, 2024