E-Paper
Advertisement

ట్రైనీ DSPలకు సీఎం రేవంత్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్‌?

ట్రైనీ DSPలకు సీఎం రేవంత్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్‌?
Advertisement

DSP Recruitment: డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో డీఎస్పీల నియామకం చేపట్టామని, నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈ ప్రభుత్వమే పూర్తి చేసిందని అన్నారు. 2011లో గ్రూప్-1 నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత 2025 వరకు దాదాపు 13 ఏళ్లు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలు చేపట్టలేదు. కొన్ని నెలలు ఆలస్యమైతేనే ఏళ్లు కోల్పోయామన్న బాధ అనిపిస్తుందని, టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చినా ప్రశ్నాపత్రాలు, ఇతర అంశాల్లో జరిగిన గందరగోళం అందరికీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

టీజీపీఎస్సీ ప్రక్షాళన..

మీరు ఆ రోజు బాధితులు. ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిర్లక్ష్యం చాలా మందికి కష్టనష్టాలు మిగిల్చింది. నేను ముఖ్యమంత్రిగా కాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించానని, టీజీపీఎస్సీలో గతంలో సభ్యులుగా పనిచేసిన వారిలో ఆర్‌ఎంపీ డాక్టర్లు లాంటి వాళ్లు ఉన్నారని అన్నారు. ఉన్నత స్థాయిలో నియామకాలు చేపట్టే టీజీపీఎస్సీ బోర్డులో అంతకంటే కింది స్థాయి వాళ్లను, అవగాహన లేని వాళ్లను సభ్యులుగా నియమించడమే ప్రభుత్వ తప్పు.. రాజకీయ పునరావాసానికి కేంద్రంగా టీజీపీఎస్సీ తయారైందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. యూపీఎస్సీ తీసుకుంటున్న విధానాలను అధ్యయనం చేసి టీజీపీఎస్సీని ఆ తరహాలో రూపొందించామని అన్నారు.

డీజీ మహేందర్ రెడ్డి..

Advertisement

యూపీఎస్సీకి స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నామని, టీజీపీఎస్సీ మొదటి ఛైర్మన్‌గా రిటైర్డ్ డీజీ మహేందర్ రెడ్డిని నియమించామన్నారు. పోటీ పరీక్షలు నిర్వహించడంలో అనుభవం కలిగిన వాళ్లను, చిత్తశుద్ధి ఉన్నవాళ్లను బోర్డు సభ్యులుగా నియమించామ్ భవిష్యత్తు నిర్ణయించే వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లితే నియామకాల పట్ల అపనమ్మకం ఏర్పడుతుందని, ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకటేశంను టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించామని అన్నారు. ఈ ప్రాంతం, విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉన్న అధికారి ఛైర్మన్‌గా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 562 మంది జాయిన్ అయ్యారు. 112 మంది డీఎస్పీల నియామకం చాలా పెద్ద విషయం అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఉపాధి హామీ పథకం..

నియామకాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో పారదర్శకతను పాటించింది. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారి పిల్లలు కూడా ఈ నియామకాల్లో ఉన్నారంటే మా పారదర్శకత అర్థమవుతుంది. ఈ నియామకాల పట్ల కొందరు పని గట్టుకుని ఎన్నో ఆరోపణలు చేశారు. అవినీతి జరిగిందని, కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. రాజకీయ ఆరోపణలు మాకు కొత్త కాదు.. కానీ మీకు చాలా ఆందోళన కలిగించాయని అన్నారు. ఈ అవకాశం కూడా జారిపోతుందేమోనని ఆందోళన చెందారు. డీఎస్పీల తరఫున సుప్రీంకోర్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లిందని గుర్తు చేశారు.

Advertisement

Also read: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టీపీసీసీ బిగ్ షాక్.. షోకాజ్ నోటీసులు జారీ?

ఇది మీ జీవితాల్లో చాలా ముఖ్యం..

నిష్ణాతులైన న్యాయవాదులతో వాదించి డీఎస్పీల నియామకాన్ని సాధించామని, నాలెడ్జ్, చిత్తశుద్ధి, అంకితభావం మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టిందని అన్నారు. మీ నేపథ్యాన్ని మరిచిపోవద్దు.. మన నేపథ్యాన్ని మరిచిపోతే మన హోదాకు న్యాయం చేయలేమని, మీరు ఏ ఉద్దేశంతో పోలీస్ శాఖలో చేరారో దాన్ని మరిచిపోవద్దు అని సీఎం అన్నారు. లక్ష్యం పెట్టుకుని ప్రయత్నం చేస్తే అసాధ్యం ఏదీ ఉండదు.. చరిత్రలో చాలా మంది ఉన్నారు. లక్ష్యం పెట్టుకుని కష్టపడ్డారు కాబట్టే ఈ హోదాకు చేరుకున్నారు. ఇక ముందు రెండో అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇది మీ జీవితాల్లో చాలా ముఖ్యం. వచ్చే ముప్పై ఏళ్లు తెలంగాణ భవిష్యత్తును ఏ దిశగా నడిపించాలో అది మీ చేతుల్లోనే ఉందని అన్నారు.

సైబర్ క్రైమ్‌లో..

రాజ్యాంగం రాసే సమయంలో దేశంలో అత్యాచారాలు, హత్యలు, ఆహార కొరత అనే మూడు సమస్యలు అధికంగా ఉన్నాయి. పీవీ నరసింహారావు ఓపెన్ ఎకానమీ తీసుకువచ్చిన తర్వాత ప్రపంచంలోని అన్ని సమస్యలు మన దగ్గరకు వచ్చాయని అన్నారు. అందులో ముఖ్యమైనవి సైబర్ క్రైమ్.. వ్యక్తుల మధ్య పరిచయం లేకుండా, కనీసం చూడకుండా సర్వం దోచుకునే పరిస్థితి సైబర్ క్రైమ్‌లో ఉంది. ఇప్పుడు నేరాలు, వాటి ప్రవృత్తి మారిపోయిందని రేవంత్ అన్నారు. డ్రగ్స్ సరఫరాను నియంత్రించడంలో యుద్ధవీరులను ఇచ్చిన పంజాబ్ కూడా విఫలమైందని, సిక్కు రెజిమెంట్‌లో ఇప్పుడు సిక్కులు లేరు. బ్రిటీషర్లు కూడా భయపడిన సిక్కు జాతి డ్రగ్స్ విషయంలో నిర్వీర్యమైందని అన్నారు.

విద్యా ప్రమాణాల అధ్యయనం..

డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్‌ను తీసుకువచ్చి అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఫుడ్ సేఫ్టీ, ట్రాఫిక్, డ్రగ్స్ కంట్రోల్, సైబర్ క్రైమ్‌ల కోసం సరికొత్త వ్యవస్థలను తీసుకువచ్చామని, అవసరమైతే నూతన డీఎస్పీలను అధ్యయనం కోసం విదేశాలకు పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. విద్యా ప్రమాణాల అధ్యయనం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపిస్తున్నామని, డీఎస్పీలు తమ ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెట్టాలన్నారు. గరం, నరం, బేషరమ్ పరిస్థితి మీకు ఎదురుకావొద్దని నేను కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: మొన్న మోడీ, నేడు జై షా…బడా నేతలను సూర్య కుమార్ కలవడం వెనుక రహస్యం ఏంటి?

Tags

Related News

దౌల్తాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి ఇష్టారాజ్యం.. అల్లాడిపోతున్న పేద రోగులు!

రాహుల్ పర్యటనను అడ్డుకుంటే.. ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నేతలను అడ్డుకుంటాం: వీహెచ్ వార్నింగ్!

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టీపీసీసీ బిగ్ షాక్.. షోకాజ్ నోటీసులు జారీ?

ఓయూ లా కాలేజీ హాస్టల్‌పై వివాదం.. భవనం కూల్చివేతతో విద్యార్థుల ఆగ్రహం!

రెవెన్యూ శాఖ పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఫైర్!

కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. నల్గొండలో మహిళా హోంగార్డును ఎలా చంపాడంటే..?

తప్పుడు ఆరోపణలతో నా ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర.. డీజీపీకి వీసీ జానయ్య లేఖ

Big Stories

Advertisement
×