Suryakumar Yadav Meets PM Modi and Amit Shah: టీమిండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ జట్టుకు దూరమై తన కుటుంబంతో జాలీగా గడుపుతున్నాడు. విదేశాల్లో విహరించడమే కాకుండా, భారత దేశంలోని హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నాడు. ఈ తరుణంలోనే నాలుగు రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్య కుమార్ యాదవ్, మంగళవారం రోజున కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశాడు. కుటుంబ సమేతంగా అమిత్ షా ఇంటికి వెళ్లిన సూర్య కుమార్ యాదవ్, గంట పాటు సమావేశం అయ్యాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ ను అమిత్ షా సత్కరించారు. ప్రపంచ కప్ 2026 సందర్భంగా తనకు దక్కిన మెడల్ ను అమిత్ షాకు చూపించిన సూర్య కుమార్ యాదవ్, ఓ జ్ఞాపికను అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో రకరకాల చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
భారత పొట్టి ఫార్మాట్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో బీజేపీ బడా నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను కలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. నవంబర్ 6వ తేదీన ప్రధాని మోడీని సూర్య ఫ్యామిలీ కలిసింది. ఈ సందర్భంగా ఓ చిన్నారి పాడిన శ్రీ రాముడి పాటలను విన్నారు. ఇక సమావేశం జరిగిన నాలుగు రోజులకే సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ దక్కింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టును సోమవారం ప్రకటించగా, దీనికి సూర్య భాయ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక మంగళవారం అమిత్ షాను సూర్య భాయ్ కలవడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కాబోతున్నట్టు చర్చ మొదలైంది.
అంబానీ ఫ్యామిలీతో దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా మాట్లారని అంటున్నారు. అందుకే ఇలా వరుసగా బడా లీడర్లను సూర్య కలుస్తున్నట్టు చెబుతున్నారు. మోడీ, షా ఎవరిని కలిసినా, దాని వెనుక పెద్ద స్కెచ్ ఉంటుందని అంటున్నారు. 2027లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, అందుకే ఇప్పటి నుంచి మోడీ, షాలు గ్రౌండ్ ప్రీపేర్ చేస్తున్నట్టు చర్చ నడుస్తోంది. యూపీ మూలాలున్న సూర్యకు మంచి జరిగితే, ఆ రాష్ట్రంలో ఉన్న యాదవ్ లు బీజేపీ వైపు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకే సూర్యకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు ఇప్పించే పనిలో బీజేపీ పడిందని అంటున్నారు. మోడీ, షా చెబితే అంబానీ వింటాడని, సూర్య నెక్ట్స్ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముంబై కెప్టెన్ గా సూర్య అంటూ రేపో, ఎల్లుండో అధికారిక ప్రకటన రానుందని కూడా అంటున్నారు.