CM Revanth Reddy – KTR : వారెవా. క్యా బాత్ హై! సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారు. సేమ్ ఎజెండా. వాళ్లిద్దరి మాటా ఒక్కటే. వేరువేరుగా ఉమ్మడి టార్గెట్ వైపు అడుగుతు వేస్తున్నారు. ఎడ్డం అంటే తెడ్డం అనే ఈ రాజకీయ ప్రత్యర్థులను ఏకం చేసిన ఘనత మాత్రం మోదీదే. కేంద్రానిదే. అందుకు, పోరాట వేదికను రెడీ చేసింది తమిళనాడు సీఎం స్టాలిన్. చెన్నై కలిపింది వారిద్దరినీ.
అవును, సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు చెన్నై చేరారు. స్టాలిన్ నేతృత్వంలో నియోజవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, నేతల అఖిలపక్ష సమావేశం ఇందుకు వేదికైంది. తెలంగాణ సీఎంగా రేవంత్, ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్.. అంతా కలిసి సౌత్ ఇండియా వాయిస్‌ను బలంగా వినిపించనున్నారు. ఇది అరుదైన అంశమే. పార్టీలు వేరైనా.. రేవంత్, కేటీఆర్‌ల డిమాండ్ ఒక్కటే కావడం విచిత్రమే.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది స్టేట్స్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందనేది మన వాదన. జనాభా ప్రాతిపదికన విభజిస్తే ఉత్తర భారతంలో జనాభా ఎక్కువ కాబట్టి వారికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి. జనాభా నియంత్రణలో సౌత్ ఇండియా ముందుండటం వల్ల.. ఎంపీ స్థానాలు తగ్గి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. అప్పుడు దక్షిణాది బలం తగ్గిపోయి.. ఉత్తరాధి పెత్తనం మరింత పెరుగుతుంది. అందుకే, సౌత్ స్టేట్స్ అన్నీ కలిసి ఢిల్లీపై దండయాత్రకు సై అంటున్నాయి. ఇదీ మేటర్.
సీఎం రేవంత్‌రెడ్డి కొన్నాళ్లుగా డీలిమిటేషన్‌పై గట్టిగా మాట్లాడుతున్నారు. మోదీ, అమిత్‌షాల కుయుక్తిని చీల్చి చెండాడుతున్నారు. కేరళ పర్యటనలోనూ ఢిల్లీకి అల్టిమేటం జారీ చేశారు. దక్షిణాది ఎంపీ సీట్లు ఒక్కటి కూడా తగ్గవని అమిత్ షా తెలివిగా మాట్లాడితే.. తగ్గవూ అంటే పెరగవని చెప్పినట్టే కదా అంటూ రేవంత్ అందులోని లాజిక్ బయటకు తీశారు. అంటే, పార్లమెంట్ స్థానాల పునర్విభజన వల్ల సౌత్ ఇండియాలో ఎంపీ సీట్లకు కోత పడకపోయినా.. నార్త్ ఇండియాలో సంఖ్య మాత్రం భారీగా పెరుగుతుందనేది హిడెన్ ఓపెన్ సీక్రెట్. ఇలా రేవంత్ ఎంటర్ అయ్యాకే.. బీజేపీ డిఫెన్స్‌లో పడింది. సీఎం రేవంత్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు అసలు ఈ టాపికే మాట్లాడటం మానేశారంటే రేవంత్ దూకుడు ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది.
Also Read : సీఎం రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు మీటింగ్.. ఏంటి సంగతి?
ఇక, తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే కేంద్రంతో చిన్నపాటి యుద్దమే చేస్తున్నారు. ఆయనే చొరవ తీసుకుని.. చెన్నైలో సౌత్ ఇండియా అఖిల పక్ష భేటీ ఏర్పాటు చేశారు. సీఎంలతో పాటు బీజేపీయేతర పార్టీలనూ పిలిచారు. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ వెళ్లారు. డీలిమిటేషన్‌కు బీఆర్ఎస్ వ్యతిరేకమే. కాకపోతే, కవిత మీదున్న కేసుల భయమో ఏమో.. ఇప్పటి వరకైతే గట్టిగా గొంతెత్తింది లేదు. ఇప్పుడు స్టాలిన్ పిలిచే సరికి.. సీఎం రేవంత్ కూడా వెళ్తున్నారని తెలిసి.. కేటీఆర్ కూడా చెన్నై చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సౌత్ ఇండియా డిమాండ్లకు జై కొట్టారు.
పార్టీలు, విధానాల పరంగా రేవంత్, కేటీఆర్ భిన్నధృవాలు. అదే మనకు అన్యాయం జరుగుతుంది అనగానే.. కేంద్రం, మోదీలపై పోరాటానికి వేరువేరుగానైనా పోరాటానికి సన్నద్ధం కావడంతో పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరిగింది.