BigTV English

Committee On HCU Issue: HCU భూముల వివాదంపై మంత్రుల కమిటీ

Committee On HCU Issue: HCU భూముల వివాదంపై మంత్రుల కమిటీ

Committee On HCU Issue: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల తొలగింపు పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ కమిటీ హెచ్‌సీయూ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, సివిల్‌ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది.


ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు

కాగా.. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల తొలగింపు పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ కమిటీ హెచ్‌సీయూ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, సివిల్‌ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది.


అభివృద్ధి పనులకు TGIICకి శ్రీకారం చుట్టింది

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని TGIICకి ప్రభుత్వం అప్పగించగా.. అక్కడ అభివృద్ధి పనులకు TGIICకి శ్రీకారం చుట్టింది. అయితే.. ఇది HCU భూమి అంటూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు విపక్ష బీజేపీ బీఆర్ఎస్ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. దీంతో విపక్షాల విమర్శలకు, విద్యార్థుల ఆందోళనలకు ప్రభుత్వం ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 1975లో HCUకి కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని కేటాయించిందని తెలిపింది. కానీ.. భూ యాజమాన్య హక్కులు వర్సిటీకి బదిలీ చేయలేదని స్పష్టం చేసింది. ఇక.. అడవిని నాశనం చేస్తున్నారనే విమర్శలకు కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రెవెన్యూ, అటవీ రికార్డుల ప్రకారం.. సర్వే నంబరు 25లోని భూమిని ఏనాడూ అటవీ భూమిగా వర్గీకరించలేదని వివరాలతో సహా చూపించింది.

బీజేపీ, బీఆర్ఎస్ ఆందోళనలు

ఈ 400 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా HCUకి సంబంధించిన భూమి లేదని ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఉన్న వివాదంపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే.. తాము ఆ భూమిని TGIICకు కేటాయించామని వివరిస్తోంది. పూర్తిగా ప్రభుత్వానికి చెందిన ఈ భూమిలో భారీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి ఆధాయంతో పాటు.. 5 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని ఓ అంచనా. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఆందోళనల వలన అక్కడి పనులు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వివాద పరిష్కార దిశగా దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్రవారం నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవారితో చర్చలు మొదలు పెట్టనున్నారు.

Also Read: జింకలు, నెమళ్లు.. గ్రాఫిక్స్, ఏఐ ఫోటోలతో గోల్‌మాల్.. HCU రాజకీయం

కంచ గచ్చిబౌలిలోని భూముల విషయం రాజకీయం రాజుకుంటోంది

అవకాశం దొరికితే చాలు.. రాజకీయం రాజుకుంటోంది తెలంగాణలో! కంచ గచ్చిబౌలిలోని భూముల విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు.. ప్రధాన పొలిటికల్ పార్టీలు రంగంలోకి దిగాయి. 400 ఎకరాల సర్కారు భూములపై వివాదం ఏ స్థాయిలో నడుస్తుందో అంతా చూస్తున్నారు. కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో.. 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని కోర్టులు స్పష్టం చేశాయి. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిది లేదని ప్రభుత్వం వాదిస్తోంది.

ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ..

అయినప్పటికీ.. ఆ 400 ఎకరాల భూములపై వివాదం చల్లారడం లేదు. రోజురోజుకు ఈ విషయంలో పొలిటికల్ హీట్ పెరుగుతోందే తప్ప.. అస్సలు తగ్గట్లేదు. యూనివర్సిటీకి చెందిన భూములని రక్షించాలని.. హెచ్‌సీయూ విద్యార్థులు, పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నారు. కానీ.. ఈ 400 ఎకరాలు హెచ్‌సీయూకి చెందినవి కాదని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా.. ఈ భూమిని ఐటీ పార్క్ గానీ, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వేలం వేయాలని సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. కొందరు వ్యక్తులు, పార్టీలు పనిగట్టుకొని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాంతో.. జనంలో ఏది వాస్తవమో, ఏది అబద్ధమో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

ఈ భూముల్లో.. జింక చనిపోయినట్లుగా తప్పుడు ప్రచారం చేశారు

వివాదం నడుస్తున్న ఈ భూముల్లో.. జింక చనిపోయినట్లుగా తప్పుడు ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు, వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. కానీ.. తర్వాత అదంతా ఫేక్ అనే విషయం తేలిపోయింది. జింక చనిపోయినట్లుగా పోస్ట్ పెట్టినోళ్లే.. తెలియకుండా తప్పు జరిగిపోయిందని మళ్లీ ట్వీట్ చేశారు. నిజంగా.. అక్కడ జీవజాలానికి ఏదైనా జరిగితే ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ.. జరగనిదాన్ని జరిగినట్లుగా.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కొన్ని పార్టీలు, వ్యక్తులు చేసిన తప్పుడు ప్రచారం.. వారి పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలుస్తోంది.

ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూములేనని తేల్చి చెప్పారు

మరోవైపు ప్రభుత్వ భూమిని.. హెచ్‌సీయూ భూమి అని చెప్పి.. బీఆర్ఎస్, బీజేపీ విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హెచ్‌సీయూ భూముల్ని ప్రభుత్వం లాక్కోవడం లేదని.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. యూనివర్సిటీ భూములకు బదులుగా.. ఎప్పుడో ప్రభుత్వ భూములు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూములేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు కోర్టు కేసు పూర్తయినందువల్ల.. భూములు స్వాధీనం చేసుకుంటున్నట్లుగా తెలిపారు.

భూముల వ్యవహారంపై.. మంత్రులతో సమావేశమయ్యారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై.. మంత్రులతో సమావేశమయ్యారు. జరుగుతున్న తాజా పరిణామాలపై ఆరా తీశారు. మరోవైపు.. సీఎం సూచనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా భూముల కేటాయింపు, వివాదంపై దృష్టి పెట్టారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాన్ని, అవాస్తవాలను.. ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతటి వివాదం చెలరేగడంతో.. ఆ 400 ఎకరాల భూములపై సర్వే చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×