BigTV English

Brahmamudi Serial Today April 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు కాల్ చేసిన రాజ్‌ – రాజ్‌కు కారు గిఫ్ట్‌ గా ఇచ్చిన యామిని

Brahmamudi Serial Today April 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు కాల్ చేసిన రాజ్‌ – రాజ్‌కు కారు గిఫ్ట్‌ గా ఇచ్చిన యామిని

Brahmamudi serial today Episode:   కావ్యను పిచ్చి దాన్ని చేయాలని చూస్తున్న రుద్రాణిపై ఎలాగైనా రివేంజ్‌ తీర్చుకోవాలని స్వప్న ఆలోచిస్తుంది. ఇంతలో అప్పు వచ్చి ఏంటక్కా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. రుద్రాణి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. ఆవిడ గురించి వదిలేయమని అప్పు చెప్పగానే.. వదిలేసే ప్రసక్తే లేదని కావ్యను పిచ్చి దాన్ని చేయాలని చూస్తున్న మా అత్తను కూడా మనం పిచ్చిదాన్ని చేయాలని చెప్తుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా గట్టిగా బుద్ది చెప్పాలని అంటుంది. దీంతో అప్పు కూడా నువ్వు చెప్పింది కరెక్టే అక్కా.. మీ అత్త కావ్య అక్కను తిడుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది కానీ ఇంట్లో పెద్దొళ్లు ఉన్నారుగా వాళ్లే ఏమీ అనలేదు మనం ఏం చేస్తాం చెప్పు అంటుంది.


దీంతో రాహుల్‌ను ముందు బయటకు పంపిస్తే.. ఈవిడ ఒక్కదానితో ఓ ఆట ఆడుకోవచ్చు అని చెప్తుంది. ఎలాగైనా రాహుల్‌ను బయటకు పింపిస్తానని చెప్తుంది. టైం చూసి ఆడుకోవాలని చెప్తుంది. వెంటనే వేరే నెంబర్‌ నుంచి ఫోన్‌ చేసి నేను టీనాను అని చెప్తుంది. టీనానా..? ఎవరు మీరు అని రాహుల్‌ అడుగుతాడు. నేనే రాహుల్‌ టీనాను.. లాస్ట్‌ టైం మనం ఒక పార్టీలో కలిశాం అని చెప్తుంది. దీంతో రాహుల్‌ నువ్వా ఏంటమ్మా నీకు ఇన్ని రోజులకు గుర్తుకు వచ్చానా..? అంటాడు. దీంతో స్వప్న తన మాటలతో రాహుల్‌ను బురిడీ కొట్టించి బయటకు వెళ్లేలా చేస్తుంది.

రాజ్‌ ఒక్కడే కూర్చుని కావ్య గురించి ఆలోచిస్తుంటాడు. కళావతి గారు ఎందుక అలా హడావిడిగా వెళ్లిపోయారు. ఒకవేశ నా మాటలు బాధను కలిగించాయా..? లేదా నా బిహేవియర్‌లో తనకేమైనా తప్పు అనిపించిందా..? కనుక్కోవాలి అనుకుంటూ కావ్యకు మెసేజ్‌ చేస్తాడు. మెసేజ్‌ చేసిన కావ్య బాధగా రిప్లై ఇస్తుంది. దీంతో రాజ్‌ నేను హాయ్‌ అని పెట్టగానే.. తను కూడా హాయ్‌ అని పెట్టిందంటే నాకు మీద తనకు ఏం కోపం లేదన్నమాట. అనుకుని నేను ఏమైనా మిమ్మల్ని బాధపెట్టానా.. అని మెసేజ్‌  చేస్తాడు. దీంతో కావ్య అయ్యో అలా ఏమీ లేదండి ఎందుకు అలా అనుకుంటున్నారు అని రిప్లై ఇస్తుంది. దీంతో రాజ్‌ మరి ఎందుకు కాఫీ షాపు నుంచి సడెన్‌గా వెళ్లిపోయారు.


అని మెసేజ్‌ చేస్తాడు. అది చూసిన కావ్య అయ్యో నేను ఇంకో క్షణం అక్కడే ఉంటే బాధతో మీతో నిజం చెప్పేదాన్ని అందుకే వచ్చేశానండి అని మనసులో అనుకుంటూ బాధపడుతూ నాకు కొంచెం హెడేక్‌ గా ఉన్నది అందుకే వచ్చేశాను అని మెసేజ్‌ చేస్తుంది. దీంతో రాజ్‌ కాల్ చేసి ఏంటండి హెడేక్‌ గా ఉంటే నాకు చెప్పాలి కదండి.. ఇంతకీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని రాజ్‌ అడగ్గానే.. ఇంట్లో ఉన్నాను అని కావ్య చెప్తుంది. దీంతో రాజ్‌ మీ అడ్రస్‌ పెట్టండి నేను వస్తాను. అంటాడు. దీంతో కావ్య ఏడుస్తూ మీరు ఇంత ప్రేమ చూపించకండి నేను నిజం చెప్పేస్తాను అని మనసులో అనుకుంటూ ఇందాకే టాబ్లెట్‌ వేసుకున్నాను కొంచెం తగ్గింది అని చెప్తుంది.

దీంతో రాజ్‌ నేను కెఫేలో నిజమే చెప్పాను కళావతి గారు నాకు మీరు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుందండి. కళావతి గారు నేను నిజంగా మీకు తెలియదా..? అని అడగ్గానే.. కావ్య అమ్మమ్మ పిలుస్తుంది నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ కట్‌ చేస్తుంది. ఇంతలో యామిని వచ్చి రాజ్‌ చూస్తుంది. యామినిని చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు. ఏంటి అంత సైలెంట్‌గా వచ్చావు. సడెన్‌గా నిన్ను చూసే సరికి భయపడ్డాను తెలుసా..? అంటాడు రాజ్‌.  దీంతో యామిని నీ దగ్గరకు రావడానికి కూడా నేను పర్మిసన్‌ తీసుకోవాలా బావ అంటుంది. పర్మిషన్‌ అవసరం లేదు. నన్ను భయపెట్టకుండా పిలిస్తే చాలు అంటాడు రాజ్‌.  దీంతో యామిని నీకు హెల్త్‌ బాగాలేదు కాబట్టి నువ్వు ఒంటరిగా వెళితే ఏమౌతుందోనని నా భయం బావ అంటుంది. దీంతో రాజ్‌ నాకు గతం గుర్తు లేదు కానీ నేనేం చిన్న పిల్లాడిని కాదు కదా అంటాడు. దీంతో యామిని అందుకే నీకో గిప్ట్‌ తీసుకొచ్చాను. అంటూ కారు కీస్‌ ఇస్తూ.. ఇవాళ్టీ నుంచి ఈ కారు నీదే బావ అంటుంది.

కావ్య రూంలో కూర్చుని తమ పెళ్లి ఫోటో చూసుకుంటూ ఏడుస్తుంది. ఇంతలో సుభాష్‌ వస్తాడు.      ఏంటమ్మా ఇది ఇంకా ఎన్నిరోజులు అని ఇలా ఉంటావు అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో కావ్య అంటే మీరు కూడా ఆ రుద్రాణి మాటలు నమ్ముతున్నారా..? అంటుంది. అదేం లేదమ్మా కానీ నిన్ను అందరూ తప్పు పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. దీంతో మామయ్య వాళ్లకు నిజం తెలియదు.. కానీ నాకు నిజం తెలుసు అంటుంది. దీంతో సుభాష్‌ నువ్వు నిజంగా రాజ్‌ను చూసి ఉంటే వాడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. కావ్య ఆ నిజం మీకు చెప్పలేను మామయ్య అని మనసులో అనుకుంటుంది. రుద్రాణిని పిచ్చి దాన్ని చేయాలనుకున్న అప్పు, స్వప్న తమ నాటకం మొదలు పెడతారు. డైనింగ్‌ టుబుల్‌ దగ్గర రుద్రాణిని పిచ్చి దాన్ని చేస్తారు.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×