BigTV English

Work Hours Or Productivity: ఏది ముఖ్యం?.. నాణ్యత లేదా పని గంటలా?

Work Hours Or Productivity: ఏది ముఖ్యం?.. నాణ్యత లేదా పని గంటలా?

Work Hours Or Productivity| ఆఫీసులో పని గంటలపై దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓ చర్చ నడుస్తోంది. చాలామంది ప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు. ఇటీవల.. ముకేశ్ అంబానీ కుమారుడు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ అధిక పని గంటలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు. చేస్తున్న పని నాణ్యత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకు ముందు.. ప్రముఖ టెక్ కంపెనీ కేప్ జెమినీ సీఈఓ అశ్విన్ యార్డీ కూడా తనకు ఫలితాలు ముఖ్యమని, పని గంటలు ముఖ్యం కాదని అన్నారు.


మరోవైపు, వారానికి అత్యధిక పని గంటలు ఉండాలని గతంలో ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఎల్&టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు చెప్పారు. ఆఫీసులో ఎక్కువసేపు పని చేయాలని, ఆదివారాలు కూడా పని చేయాలని వారు అన్నారు. పని గంటలు, పని నాణ్యతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. నిపుణులు వీటిలోని వివిధ అంశాలను విశ్లేషిస్తున్నారు.

పని గంటలు ముఖ్యమే
అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడం: సరైన పని గంటలు ఉండడం వల్ల ఉద్యోగులు క్రమశిక్షణతో, ఫోకస్‌గా పని చేయడానికి వీలవుతుంది. నిర్దిష్ట కాలవ్యవధిలో పనులు పూర్తయ్యేలా చేయడంలో ఇది సహాయపడుతుంది. ఇది మొత్తం ఉత్పాదకతను (ప్రాడక్టవిటీ) పెంచుతుంది.


సమన్వయం – సహకారం: టీమ్ సభ్యుల మధ్య సమన్వయం మరియు సహకారాన్ని సులభతరం చేయడానికి పని గంటలు తోడ్పడతాయి. అందరూ ఒకేసారి అందుబాటులో ఉన్నప్పుడు, సమావేశాలను షెడ్యూల్ చేయడం, ప్రాజెక్టులను చర్చించడం మరియు సమష్టి నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది.

వర్క్-లైఫ్ బ్యాలెన్స్: నిర్దిష్ట పని గంటలు వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల మధ్య స్పష్టమైన సరిహద్దును సృష్టించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ సమతుల్యతను నిర్వహించడానికి ఇవి కీలకం.

Also Read: వారానికి 70 గంటలు పనిచేసిన ఐటి ఉద్యోగి.. విడాకులు కావాలంటున్న భార్య!

పని నాణ్యత

క్లయింట్ల సంతృప్తి: పని నాణ్యతపై దృష్టి పెట్టడం వల్ల ఉద్యోగులు మెరుగైన ఫలితాలు అందించే అవకాశం ఉంది. దీనివల్ల క్లయింట్లు సంతృప్తి చెందుతారు.

ఇన్నోవేషన్, క్రియేటివిటీ: నాణ్యత ఆధారిత పనిలో ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. పని గంటలకు పరిమితం కాని ఉద్యోగులు కొత్త ఆలోచనలు, విభిన్న విధానాలను అన్వేషించవచ్చు.

ఉద్యోగుల సంతృప్తి: పనిలో నిత్యం అధిక నాణ్యమైన అవుట్‌పుట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులు సంతృప్తి చెందుతూ.. కొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రేరణ పొందే అవకాశం ఉంది. ఇది సానుకూల పని వాతావరణానికి దారితీస్తుంది.

పని గంటలు, పని నాణ్యత ఏది ముఖ్యం?
ఉత్పాదకతను పెంచడానికి పని గంటలు, పని నాణ్యత రెండూ చాలా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికోసం కొన్ని విధానాలను సూచిస్తున్నారు.

అవుట్‌పుట్‌పై దృష్టి: పని గంటల సంఖ్యకు బదులుగా అవుట్‌పుట్ నాణ్యతపై దృష్టి కేంద్రీకరించాలి. దీనికోసం సంస్థలు స్పష్టమైన లక్ష్యాలు, అంచనాలను నిర్ణయించాలి. సహేతుకమైన కాలపరిమితిలో అధిక నాణ్యత ఉన్న పనిని అందిస్తే కలిగే ప్రయోజనాలను నొక్కి చెప్పాలి.

నైపుణ్యాలు అభివృద్ధి: ఉద్యోగులకు శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి అవకాశాలను అందించాలి. దీనివల్ల వారి పని నాణ్యత మెరుగుపడుతుంది. నిరంతర అభ్యాసం సృజనాత్మకతకు దోహదం చేస్తుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు: ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూళ్లలో పని చేయడానికి ఉద్యోగులకు అవకాశం కల్పించాలి. దీనివల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా అధిక నాణ్యత కలిగిన అవుట్‌పుట్ వస్తుంది.

విరామాలు: క్రమం తప్పకుండా విరామాలు, డౌన్‌టైమ్‌ను ప్రోత్సహించడం సృజనాత్మకతను పెంచుతుంది. కొంతమంది ఉద్యోగులు పని సమయాల్లో కాసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటారు. అలాంటివారికి రీఛార్జ్ అయ్యేందుకు కొంత సమయం ఇస్తే నాణ్యమైన అవుట్‌పుట్ అందించే అవకాశం ఎక్కువ.

పని గంటలు, పనిలో నాణ్యత రెండూ ముఖ్యమైనవే. అయినప్పటికీ ఒకదాని కంటే మరొకదానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అసమతుల్యతకు దారితీస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఉద్యోగులు నాణ్యమైన పని కోసమే ప్రయత్నించాలి.

Tags

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×