E-Paper
Advertisement

CM Revanth In Delhi: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్, కేంద్రమంత్రులతో భేటీ, ప్రాజెక్టులు.. ఆపై నిధులపై చర్చ

CM Revanth In Delhi: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్, కేంద్రమంత్రులతో భేటీ,  ప్రాజెక్టులు.. ఆపై నిధులపై చర్చ
Advertisement

CM Revanth In Delhi: ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ముందు పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రక్షణశాఖ, రైల్వే, విమానయాన శాఖ మంత్రులతో ఆయన సమావేశమై ప్రాజెక్టుల గురించి చర్చించారు.

ఢిల్లీ టూర్‌లో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారు. గురువారం ఉదయం నుంచి పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఫిబ్ర‌వ‌రి చివ‌రివారంలో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. ఈసా, మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి ర‌క్ష‌ణ‌మంత్రికి వివరించారు.

1948 ఫిబ్ర‌వ‌రిలో మ‌హాత్ముని చితాభస్మం ఈ ప్రాంతంలో నిమ‌జ్జ‌నం చేసిన విషయాన్ని తెలిపారు. మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. బాపూ ఘాట్‌ను ప్ర‌పంచ స్థాయి విద్యా, సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ చిహ్నంగా నిల‌ప‌నున్న‌ట్లు తెలిపారు.

Advertisement

కేంద్రమంత్రులతో సీఎం భేటీ.. ప్రాజెక్టులు-నిధులపై చర్చ

ఆ తర్వాత కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి, కొత్తగా రైల్వే లైన్లు గురించి మంత్రికి వివరించారు. ఆ తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌తో భేటీ అయ్యారు సీఎం రేవంత్‌.

తెలంగాణలో మామనూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పై ఈ సందర్భంగా చర్చించారు. వరంగల్ జిల్లా మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి కావడంతో అవసరమైన పనులు చేపట్టాలని కోరారు సీఎం. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు రెడీగా ఉందన్నారు. దీనికితోడు కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు పాల్వంచలో భూమి ఉందని తెలిపారు.

ALSO READ: కేసీఆర్ మదిలో పొత్తు ఆలోచన?

దీనికి సంబంధించి OLS సర్వే, ఫీజుబులిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్ పోర్ట్ కు ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.

 

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×