BigTV English

CM Revanth reddy: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి నివాళుర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి నివాళుర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy Pays Tribute To Former Union Minister Jaipal Reddy: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో స్ఫూర్తి స్థల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎంతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు ఉన్నారు.


అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జైపాల్ రెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో జైపాల్ రెడ్డి పాత్ర మరవలేమని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి 5వ వర్ధంతిని కుటుంబ సభ్యులతో కలిసి స్ఫూర్తి స్థల్ లో నివాళులర్పించారు. ఆయనతోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు.


Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×