BigTV English

YS Sharmila On Jagan: సిగ్గు సిగ్గు.. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్: వైఎస్ షర్మిల

YS Sharmila On Jagan: సిగ్గు సిగ్గు.. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్: వైఎస్ షర్మిల

AP PCC YS Sharmila Reddy demanded jagan should Resign from the Post of MLA:మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై APCC చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి మరోసారి పదునైన విమర్శలు గుప్పించారు. జగన్‌ను టార్గెట్‌ చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్‌ చేశారు. అసెంబ్లీకి పోని జగన్ మోహన్ రెడ్డి MLA పదవికి రాజీనామా చేయాలన్నారు.


“సిగ్గు సిగ్గు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవంటూ ద్వజమెత్తారు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, జగన్ మోహన్ రెడ్డి అంటూ ఫైర్‌ అయ్యారు. మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని పేర్కొన్నారు షర్మిల. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనమ్నారు.

MLA అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ అని.. మెంబర్‌ ఆఫ్‌ మీడియా అసెంబ్లీ కాదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా.. లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? అంటూ ప్రశ్నించారు. ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని… రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని విమర్శించారు షర్మిల. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే.. తాపీగా ప్యాలెస్‌లో కూర్చుని మీడియా మీట్‌లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని MLAను చేసిందని హితవు పలికారు.


Also Read: ఏపీ మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..అప్పటినుంచే

గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్‌లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, MLA హోదాకు కూడా అర్హులు కారని సూచించారు.

వెంటనే రాజీనామా చేయండి!! బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పని లోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు MLAగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో.. అంటార్కిటికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ MLA పదవులకు రాజీనామా చేయాలని” ఎక్స్ వేదికగా  డిమాండ్ చేశారు వైఎస్‌ షర్మిల.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×