CM Revanth Reddy: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. నోవాటెల్ హోటల్ లో సీఎం ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మధ్యలో ఆగిపోయినట్టు తెలుస్తోంది.
దీంతో అధికారులు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న హోటల్ సిబ్బంది, సీఎం రేవంత్ సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమై లిఫ్ట్ ను ఓపెన్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. సీఎంను వేరే లిఫ్ట్ లో ఎక్కించి సెకండ్ ఫ్లోర్ కు తీసుకెళ్లారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: NMDC Recruitment: ఒక్క ఇంటర్వ్యూతోనే కొలువు, ఈ అర్హతలు ఉంటే చాలు, ఇదిగో పూర్తి వివరాలు..
ఇది కూడా చదవండి: BREAKING: 2,260 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు